Hanuman Chalisa Controversy: అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతుల బెయిల్ పిటిషన్‌పై ముంబై సెషన్స్ కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ముంబై పోలీసులు బెయిల్ పిటిషన్‌ను గట్టిగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు రాణా దంపతులు పదేపదే విఘాతం కల్పిస్తున్నారని వాదనలు వినిపించారు. దీంతో బెయిల్ పిటిషన్‌పై విచారణను ముంబై సెషన్స్ కోర్టు శనివారానికి వాయిదా వేసింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని చెప్పి నవనీత్ రాణా దంపతులు జైలు పాలైన సంగతి తెలిసిందే. బెయిలు దరఖాస్తులపై శనివారం మధ్యాహ్నం 2.45 గంటలకు విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.
మహారాష్ట్ర గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఎంపీ నవనీత్ కౌర్ కొన్ని రోజులుగా పోరాటం చేస్తోంది. రాష్ట్రంలో శాంతి ఏర్పడాలంటే సమస్యలు పరిష్కారం కావాలంటే సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా చదవాలని ఎంపీ నవనీత్ కౌర్ దంపతులు నిర్ణయించారు. మహారాష్ట్రలో పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గా పేరు తెచ్చుకున్న నవనీత్ కౌర్ ఆమె భర్త కలిసి తీసుకున్న ఈ నిర్ణయం అలజడి రేపినట్లయింది. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. హైడ్రామా వద్ద పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఆ తరువాత మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేసు నమోదు చేశారు. అమరావతి ఎంపీ నవనీత్ రాణా, బడ్నేరా ఎమ్మెల్యే రవి రాణాలపై ఐపీసీ సెక్షన్ 153(ఏ), బోంబే పోలీస్ యాక్ట్‌లోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. కోర్టు వీరికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
మరిన్ని పొలిటికల్ వార్తలకి ఇక్కడ క్లిక్ చేయండి