AP MPTC ZPTC Results 2021: ఏపీలో కాకరేపుతున్న లోకల్‌ ఫైట్‌.. దుగ్గిరాలలో బయటపడ్డ క్యాంపు రాజకీయాలు.. ఎన్నిక రేపటికి వాయిదా

|

Sep 24, 2021 | 5:22 PM

గుంటూరుజిల్లాలో ఎంపీపీ ఎన్నికలు టెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. కోరం లేకపోవడంతో దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. మొత్తం18 మంది ఎంపీటీసీలకు గానూ..

AP MPTC ZPTC Results 2021: ఏపీలో కాకరేపుతున్న లోకల్‌ ఫైట్‌.. దుగ్గిరాలలో బయటపడ్డ క్యాంపు రాజకీయాలు.. ఎన్నిక రేపటికి వాయిదా
Duggirala Mpp Elections Pos
Follow us on

క్షణం క్షణం ఉత్కంఠ.. ఉద్రిక్తత.. గ్రూపు పాలిటిక్స్‌.. క్యాంప్‌ రాజకీయాలు.. ఇది లోకల్‌ ఫైట్‌ సీన్‌.. ఏపీలో ఎంపీపీ ఎన్నిక కాక రేపుతోంది. అధికార, విపక్షపార్టీల్లో గ్రూపు తగాదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యేలతోపాటు చివరకు పార్టీ అధినేతలకు సైతం తలనొప్పిగా మారాయి. కొన్నిచోట్ల ఇప్పటికే ఎంపీపీ ఎన్నిక పూర్తికాగా.. మరికొన్ని చోట్ల పోలీసు బలగాల మధ్య ఎన్నిక జరపాల్సి వస్తోంది. గుంటూరుజిల్లాలో ఎంపీపీ ఎన్నికలు టెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. కోరం లేకపోవడంతో దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. మొత్తం18 మంది ఎంపీటీసీలకు గానూ..వైసిపికి చెందిన 8 మంది ఎంపీటీసీలు మాత్రమే హాజరయ్యారు. టిడిపి, జనసేనకు చెందిన ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. ఎంపీపీ పదవికి ఒక్కరే నామినేషన్ వేశారు. అటు అమరావతి ఎంపీపీ ఎన్నిక కూడా ఉత్కంఠ రేపింది. ఎంపీపీ అభ్యర్థిగా మేకల హన్మంతరావు బీఫామ్‌ అందుకున్నారు. ఐతే అతను వద్దంటూ కోటహరిబాబు మిగతా 11 మంది ఎంపీటీసీలతో క్యాంపులో ఉన్నారు. పెదకూరపాడులోనూ అదే పరిస్థితి నెలకొంది.

టీడీపీ,జనసేన ఎంపీటీలు రాకపోవడంతోనే కోరం లేదని దుగ్గిరాల ఎన్నిక వాయిదా పడిందన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. 9 మంది ఎంపీటీలు గెలిచినా టిడిపి ఎంపీటీసీలు ఎందుకు హాజరుకాలేదని ఆయన ప్రశ్నించారు. బీసీ ఎంపీటీసీ లేకపోవడం కారణంగానే టీడీపీ హాజరుకాలేదన్నారు.

అనంతపురంజిల్లా తలుపుల ఎంపీపీ ఎన్నికల్లో అధికార వైసిపిలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తరపున నలుగురు ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. వైసిపిలో మరోవర్గం నేత పూల శ్రీనివాస్‌రెడ్డి తరఫున ఇద్దరు టీడీపీ ఎంపీసీటీలు సహా…8 మంది వైసిపి ఎంపీటీలు హాజరుకావడంతో ఉత్కంఠ రేపుతోంది.

తూర్పుగోదావరిజిల్లా పి.గన్నవరంలో ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠగా మారింది. టిడిపి, జనసేన ఎంపీటీసీలు కోరం ఎదుట హాజరుకాలేదు. దాంతో ఎన్నిక వాయిదా వేశారు. ఈ ఎన్నికకు వైసిపి, బీఎస్పీ ఎంపీటీసీలు మాత్రమే హాజరయ్యారు. టిడిపి,జనసేనల మధ్య క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. అటు విజయనగరంజిల్లా వేపాడులో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎంపీటీసీల్లో ఓ వర్గం ఆందోళనకు దిగింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

శ్రీకాకుళంజిల్లా పొందూరు ఎంపీపి ఎన్నిక కూడా టెన్షన్‌ క్రియేట్‌ చేస్తోంది. మొత్తం 21 ఎంపీటీసీ స్థానాల్లో వైసిపి 12, టీడీపీకి 9 దక్కాయి. కో-ఆఫ్షన్‌ నెంబర్‌ ఎన్నికల కోసం 9 మంది వైసిపి, 9 మంది టిడిపి ఎంపీటీసీలు హాజరయ్యారు. ఐతే ముగ్గురు వైసిపి ఎంపీటీసీలు గైర్హాజరవ్వడంతో కో-ఆఫ్షన్‌ నంబర్‌ ఎన్నికలపై అనిశ్చితి నెలకొంది.

అటు ప్రకాశంజిల్లాలో 53 ఎంపీపీ పదవులకోసం అధికార వైసిపిలోనే తీవ్రపోటీ నెలకొంది. దర్శి, కొండేపి,పర్చూరు నియోజకవర్గాల్లో రెండువర్గాలు పోటీపడుతున్నాయి. మార్టూరు, పర్చూరు, కారంచేడు, చినగంజాం, ఇంకొల్లు ఎంపీపీ పదవులకోసం యుద్దనపూడిలో క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇక దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలం ఎంపీపి ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.ఇక్కడ స్థానిక ఎమ్మల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ వర్గాల మద్య వివాదం నెలకొంది.

ఇవి కూడా చదవండి: JC vs MLC Jeevan: రాజకీయాలు మాట్లాడాలంటే బయటే చూసుకోవాలి.. జేసీకి క్లాస్ పీకిన ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి..

CM Jagan: వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్..