18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..అస్త్ర శస్త్రాలను సిద్దం చేస్తోన్న పార్టీలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 18నుంచి ప్రారంభం కానున్నాయి. వీటిపై చర్చించేందుకు రేపు ఆల్ పార్టీ మీటింగ్‌ను లోక్ సభ స్పీకర్ నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో ఈ భేటీ ప్రారంభం కానుంది. ఇక  దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీల ప్రతినిధులకు పార్లమెంట్ కార్యాలయం నుంచి సమాచారం అందింది.  20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటనను విడుదల చేశారు.  ప్రశాంత […]

18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..అస్త్ర శస్త్రాలను సిద్దం చేస్తోన్న పార్టీలు
Follow us

| Edited By:

Updated on: Nov 16, 2019 | 10:57 PM

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 18నుంచి ప్రారంభం కానున్నాయి. వీటిపై చర్చించేందుకు రేపు ఆల్ పార్టీ మీటింగ్‌ను లోక్ సభ స్పీకర్ నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో ఈ భేటీ ప్రారంభం కానుంది. ఇక  దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీల ప్రతినిధులకు పార్లమెంట్ కార్యాలయం నుంచి సమాచారం అందింది.  20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటనను విడుదల చేశారు.  ప్రశాంత వాతావరణంలో సమావేశాలు జరుపుకుందామని, అందుకు అందరూ సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి కోరారు. కాగా ఎల్లుండి మరోసారి పార్టీల పార్లమెంటరీ నాయకులతో జోషి భేటి అవ్వనున్నారు. కాగా ఈ సమావేశాల్లో పలు రకాల బిల్లులను పాస్ చెయ్యాలని, కీలక ఆర్డినెస్సులను తీసుకురావాలని బీజేపీ భావిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం-1961, ఆర్థిక చట్టం-2019లను సవరిస్తూ.. దేశీయ కంపెనీల కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తోపాటు ఇ-సిగరెట్ల అమ్మకం, ఉత్పత్తి, నిల్వలను నిషేదిస్తూ తీసుకొచ్చిన అర్డినెన్స్‌  బీజేపీ ప్రధాన టార్గెట్‌గా తెలుస్తోంది. ఇక ఆర్థిక మందగమనంపై ప్రధానంగా అధికార పక్షాన్ని టార్గెట్ చెయ్యాలని కాంగ్రెస్ భావిస్తోంది.

సన్నద్దమైన తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు:

పార్లమెంట్ సమావేశాల్లో ఎటువంటి వ్యూహం అనుసరించాలన్న విషయంపై వైసీపీ అధినేత జగన్‌తో..ఎంపీలు భేటీ అయ్యారు. ముఖ్యంగా ..ఏపీకి ప్రత్యేక హోదా, పెండింగ్ నిధులు వంటి కీలక అంశాలపై జగన్ ఫోకస్ చెయ్యమన్నట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశాలను స్కిప్ చెయ్యెద్దని ఎంపీలకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన అంశాలపై మీడియాతో మాట్లాడేటప్పడు సైతం..సంయమనంతో వ్యవహరించాలని..ప్రత్యేక హోదా ప్రధాన టార్గెట్ అని జగన్ ఎంపీలకు స్పష్టం చేశారు.

………………………………………

ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేడు భేటీ అయ్యింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహలపై సభ్యలు కీలక చర్చ జరిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేటీఆర్ ప్రధానంగా ఫోకస్ చెయ్యమన్నట్లు సమాచారం.

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..