బ్రేకింగ్: అసెంబ్లీ నుంచి చంద్రబాబు వాకౌట్..!

| Edited By: Pardhasaradhi Peri

Jul 23, 2019 | 4:05 PM

ఏపీ అసెంబ్లీలో హాట్‌హాట్‌గా చర్చలు జరుగుతోన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీలో.. ముగ్గురు సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. సభలో బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో.. టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని.. అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ సీఎం చంద్రబాబు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదంటూ చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వాకౌట్‌ చేశారు. ఉపసభాపతికి […]

బ్రేకింగ్: అసెంబ్లీ నుంచి చంద్రబాబు వాకౌట్..!
Follow us on

ఏపీ అసెంబ్లీలో హాట్‌హాట్‌గా చర్చలు జరుగుతోన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీలో.. ముగ్గురు సభ్యులు సస్పెండ్‌ అయ్యారు. సభలో బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో.. టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని.. అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ సీఎం చంద్రబాబు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదంటూ చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వాకౌట్‌ చేశారు. ఉపసభాపతికి నమస్కారం పెట్టి సభ నుంచి వీరంతా బయటకు వచ్చేశారు.