తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ ప్రత్యేక పార్టీ ఏర్పాటుకు పూనుకున్న వైయస్ షర్మిల పార్టీ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. కొత్త పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉండాలి, జెండా, ఎజెండా రూపకల్పనలో సీనియర్ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. దీని కోసం వివిధ జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.
ఇప్పటికే లోటస్‌పాండ్‌లో పలువురు నేతలు షర్మిలను కలిసి తమ మద్దతును ప్రకటించారు. మరోవైపు పార్టీ సలహాదారులుగా మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి ఉదయసిన్హాలను నియమించారు. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో సీఎంవోలో అడిషనల్ సెక్రటరీగా ప్రభాకర్ రెడ్డి పని చేయగా, సీఎస్ఓగా ఉదయసిన్హా పని చేశారు.
మరోవైపు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ కూడా షర్మిల పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. బ్రదర్ షఫీకి యూత్ మంచి ఫాలోయింగ్ ఉంది. పార్టీ నేతలు, కార్యకర్తలను తన ఉత్తేజపూరిత ప్రసంగాలతో ఆయన మోటివేట్ చేయగల సత్తా ఆయన సొంతం. ఇంకోవైపు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య షర్మిలను కలిసి, ఆమెకు మద్దతు పలికారు.
Read more: