
ఏపీ, తెలంగాణలో పోలింగ్ హోరాహోరీగా సాగింది. ఓటరు తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఫలితం తేలడానికి ఇంకా 41 రోజుల టైముంది. అప్పటి వరకు ఈవీఎంలను కంటికి రెప్పలా కాపాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర మూడంచల భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర, రాష్ట్ర బలగాలతో బందోబస్తును పటిష్టం చేస్తున్నారు. మొదటి అంచెలో స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర కేంద్ర సాయుధ బలగాలను మోహరిస్తున్నారు. రెండో అంచెలో రాష్ట్ర ప్రత్యేక బలగాలు.. మూడో అంచెలో రాష్ట్ర పోలీసులు స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర పహారా కాస్తారు.