AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారణాసిలో మోదీ నామినేషన్‌కు ముహుర్తం ఫిక్స్

లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని మోదీ నామినేషన్‌కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే యూపీలో కొన్నిస్థానల్లో ఎన్నికలు ముగిశాయి. లోక్‌సభ సీట్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్‌లో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలు పూర్తయ్యాయి. అయితే ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి ఎన్నికలు ఏడవ విడతలో జరగనున్నాయి. మే 19న ఏడవ విడత ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేసేందుకు అన్నీ రెడీ చేసుకున్నారు. వరుసగా […]

వారణాసిలో మోదీ నామినేషన్‌కు ముహుర్తం ఫిక్స్
Ram Naramaneni
|

Updated on: Apr 24, 2019 | 1:48 PM

Share

లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని మోదీ నామినేషన్‌కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే యూపీలో కొన్నిస్థానల్లో ఎన్నికలు ముగిశాయి. లోక్‌సభ సీట్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్‌లో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలు పూర్తయ్యాయి. అయితే ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి ఎన్నికలు ఏడవ విడతలో జరగనున్నాయి. మే 19న ఏడవ విడత ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేసేందుకు అన్నీ రెడీ చేసుకున్నారు. వరుసగా రెండోసారి ఇక్కడ నుంచి పోటీ చేయనున్న మోదీ మరో రెండు రోజుల్లో అంటే ఈనెల 26న నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ సందర్భంగా రెండు రోజుల పాటు ఆయన అక్కడే పర్యటించనున్నారు.

2014 సాధారణ ఎన్నికల్లో వారణాసితో పాటు గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నుంచి కూడా పోటీ చేసి గెలుపొందారు మోదీ. అయితే గెలిచిన అనంతరం వడోదర నుంచి తప్పుకున్న మోదీ.. వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. నాటి ఎన్నికల్లో వారణాసి స్థానం నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై 3 లక్షల ఓట్ల తేడాతో నరేంద్ర మోదీ విజయం సాధించారు. వడోదర స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి మధుసూద మిస్గ్రీ మీద భారీ మెజార్టీతో గెలుపొందారు మోదీ. ఈసారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కూడా రెండుచోట్ల నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. యూపీలోని అమేథితో పాటు… కేరళలోని వయనాడ్‌లో కూడా ఆయన నామినేషన్ వేశారు.

Follow Us
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి