నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మంత్రి గంగుల కమలాకర్. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి ఎజెండాకు ఈ ఎన్నికల ద్వారా ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియజేశారని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలు మరింత ప్రోత్సాహం ఇచ్చారని తెలిపారు. మెన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలైన ఇవాల్టి ఎమ్మెల్యే ఎన్నికలైనా రేపటి మున్పిపల్ ఎన్నికలైనా టీఆర్ఎస్ దే గెలుపని, కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోనే మా గెలుపు మంత్రమని చెప్పారు మంత్రి గంగుల.
నాగార్జున సాగర్ ఫలితాల సరళితో టీఆర్ఎస్ కు కాంగ్రెస్, బీజేపీలు ప్రత్యర్థులు కానేకావని ఆ స్థాయి వాటికి లేదని తేటతెల్లం అయిందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అధికారం కోసం అడ్డగోలు కూతలు కూసే జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారని అన్నారు. వాపును చూసి బలుపని విర్రవీగిన బీజేపీకి తెలంగాణ ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన జానారెడ్డి నాగార్జునసాగర్‌ను అభివృద్ధి చేసింది ఏమిలేదని ప్రజలే తీర్పు చెప్పారన్నారు.
దివంగత నోముల నర్సింహయ్య చేసిన అభివృద్ది, ముఖ్యమంత్రి తమకు అండగా ఉన్నాడనే నమ్మకంతోనే ప్రజలు సాగర్‌లో టీఆర్‌ఎస్‌కు 18వేల పైచీలుకు మెజార్టీ ఇచ్చారని, ఇంతటి ఘనవిజయాన్ని అందించిన సాగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు మంత్రి గంగుల కమలాకర్. ఈ విజయానికి కృషి చేసిన ప్రతీ టీఆర్ఎస్ కార్యకర్తకు, నేతలకు, అభ్యర్థి నోముల భగత్ కు అభినందనలు తెలియజేశారు.
ఇక ఐదు రాష్ట్రాల్లో వెలువడుతున్న తీర్పుని చూస్తే జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని, తమ ప్రాంత అవసరాలు తెలిసి, తమ ఆత్మాభిమానం కాపాడే ప్రాంతీయ పార్టీలనే ప్రజలు ఆదరిస్తున్నారని ఈ ఎన్నికలు నిరూపించాయి అన్నారు మంత్రి గంగుల కమలాకర్, ఇప్పటికైనా కేవలం మాటలతో కాలక్షేపం మాని ప్రజావసరాలను తీర్చడానికి కృషి చేయాలని హితవు పలికారు. ప్రజా సంక్షేమంలో మాతో పోటీకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు.
తమిళనాడులో డిఎంకే, పశ్చిమ బెంగాల్లో త్రుణమూల్ శ్రేణులకు, నాయకులకు అభినందనలు తెలియజేశారు మంత్రి. టీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ఇంటి పార్టీ అని టీఆర్ఎస్‌నే తెలంగాణకు శ్రీ రామ రక్ష అని ప్రజలు మరోసారి మరోసారి భివిస్తున్నట్లు ఎన్నికలు నిరూపించాయని గంగుల కమలాకర్ అన్నారు. ఈ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో ప్రజాసేవలో మరింత ఉత్సాహంగా పనిచేస్తామన్నారు.