Eetala Rajender: ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్.. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై కమలం నేత ఫైర్

|

Feb 10, 2022 | 11:57 AM

తెలంగాణలోని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌(Eetala Rajender)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ(BJP) కార్యకర్తలపై దాడులకు నిరసనగా..

Eetala Rajender: ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్.. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై కమలం నేత ఫైర్
Eetala
Follow us on

తెలంగాణలోని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌(Eetala Rajender)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ(BJP) కార్యకర్తలపై దాడులకు నిరసనగా.. జనగామలో మౌన దీక్షకు పార్టీ పిలుపునిచ్చింది. బీజేపీ పిలుపునిచ్చిన మౌన దీక్షకు అనుమతి లేదని పోలీసులు ఈటల రాజేందర్‌ను హైదరాబాద్‌లో గృహ నిర్బంధం చేశారు. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులుంటాయని, ఇలా తనను అరెస్టు చేయడం సరికాదని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీఆర్ఎస్‌(TRS)కు తలొగ్గారని విమర్శించారు. ప్రజాసంఘాలు, ఇతర పార్టీలకు మాట్లాడే అధికారం, నిరసన తెలిపే అధికారం తెలంగాణలో లేదా అని అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మరోవైపు, గోశామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు జనగామ వెళ్లాలనుకున్నానని.. పోలీసులు తీరు సరిగా లేదని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఏపీ విభజనపై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నిరసనల్లో పాల్గొన్నారు. అయితే, జనగామలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణల్లో 9 మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నేత మురళీధర్ రావు పరామర్శించారు.

ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులుంటాయి. నిరసనలు, బంద్‌కు టీఆర్ఎస్ పార్టీకీ మాత్రమే అనుమతిస్తారా. పోలీసులు టీఆర్ఎస్‌కు వంతపాడుతున్నారు. ఇది ఎక్కువ కాలం చెల్లదు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తు్న్నారు. దెబ్బలు తిన్న వారి మీదనే పోలీసులు కేసులు పెడుతున్నారు. కనీసం గాయపడిన వారికి ధైర్యం చెప్పే స్వేచ్ఛ కూడా లేదా.. టీచర్ల ధర్నా చేస్తే వాళ్ళను చావబాదారు. ‘టీఆర్ఎస్ వాళ్లకు బందోబస్తు ఇచ్చారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా?. తెలంగాణలో పౌర స్వేచ్ఛ లేకుండా పోయింది. ఇచ్చిన తెలంగాణ గురించి మోడీ మాట్లాడారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ వచ్చింది.

             – ఈటల రాజేందర్, హుజురాబాద్ ఎమ్మెల్యే

ఇవీచదవండి.

CM Jagan: ఏపీ సీఎం జగన్‌ సీరియస్‌.. అతి చేసినవారికి అక్షింతలు.. పునరావృతం కావొద్దని ఆదేశం

CM Jagan-Tollywood: సీఎం భేటీకి ముందు చర్చనీయాంశంగా మారిన అక్కినేని నాగార్జున వ్యవహారం.. జగన్‌తో సమావేశానికి దూరం..

Chennai BJP Office Attack: చెన్నై బీజేపీ కార్యాలయంపై దాడి.. పెట్రోల్ బాంబులు విసిరిన దుండగులు..