ED: బెంగాల్ మళ్లీ రాజకీయ రగడ.. దీదీ మేనల్లుడికి ఈడీ సమన్లు.. వెలుగులోకి బొగ్గు స్కాం..

|

Aug 29, 2021 | 7:32 AM

బెంగాల్‌లో మళ్లీ రాజకీయ రచ్చ రాజుకుంది. దీదీ మేనల్లుడికి ఈడీ సమన్లు జారీ చేయడంతో రగడ మొదలైంది. ఇప్పుడు ఈ ఇష్యూ టీఎంసీ వర్సెస్ బీజేపీగా మారింది. తమను దర్యాప్తు సంస్థలతో కాదని రాజకీయంగా ఎదుర్కోవాలని మమతా బెనర్జీ బీజేపీకి సవాల్ చేశారు.

ED: బెంగాల్ మళ్లీ రాజకీయ రగడ.. దీదీ మేనల్లుడికి ఈడీ సమన్లు.. వెలుగులోకి బొగ్గు స్కాం..
Ed
Follow us on

బెంగాల్ రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తత ప్రారంభమయింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి, ఆయన భార్య రుచిరా బెనర్జీకి సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీన రుచిరా, ఆరో తేదీన అభిషేక్ తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. బెంగాల్లో బొగ్గు స్కాం జరిగిందని దానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుల్లో ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. అభిషేక్ బెనర్జీ దంపతులతో పాటు ఇద్దరు సీనియర్ అధికారులకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. బెంగాల్‌లో కునుస్తోరియా, కజోరా ప్రాంతాల్లోని ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ బొగ్గు గనులున్నాయి. బొగ్గు గనుల్లో బొగ్గును అక్రమంగా తవ్వుకుకుని అమ్ముకున్నారని సీబీఐ కేసు పెట్టింది. గత ఏడాది నవంబర్‌లో సీబీఐ బొగ్గు స్కాంపై కేసు నమోదు చేసింది.

ఈ కేసుకు సంబంధించే నోటీసులు జారీ చేశామని ఈడీ తెలిపింది. ఈ వ్యవహారంతో అభిషేక్ బెనర్జీ భార్య రుచిరా, ఆమె సోదరి మేనకా గంభీర్‌కు కూడా సంబంధం ఉన్నట్లు సీబీఐ కేసులు పెట్టింది. అక్రమమైనింగ్‌ వ్యవహారంలో అభిషేక్ పాత్ర కీలకమని ఈడీ ఆరోపిస్తోంది.

అయితే ఎన్నికలకు ముందు ఆరోపణలు చేసి.. మళ్లీ చాలా రోజుల తర్వాత తెరపైకి తీసుకు రావడం అంతా రాజకీయం అని తృణమూల్ ఆరోపిస్తోంది. తృణమూల్‌లో పార్టీ వ్యవహారాలు ఎక్కువగా అభిషేక్ బెనర్జీనే చక్కబెడుతూంటారు. గత ఎన్నికల సమయంలో ఈ స్కాం కూడా రాజకీయ అంశం అయింది.

కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తమను వేధిస్తున్నారని మమతా బెనర్జీ మండిపడ్డారు. తాజా ఈడీ నోటీసులపైనా మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని తెగనమ్మేసిన బీజేపీ బొగ్గు కుంభకోణంలో తృణమూల్‌ను వేలెత్తి చూపించలేరని.. దమ్ముంటే తమ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలని ఆమె సవాల్‌ విసిరారు.

బొగ్గు వ్యవహారం కేంద్రం చేతిలో ఉంటుందని, బెంగాల్, అసోల్ ప్రాంతాల్లో బొగ్గు అవినీతికి పాల్పడుతున్న బీజేపీ నేతల మాటేమిటని సూటిగా ప్రశ్నించారు.

Gold and Silver Price Today: స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే

Gold Bag: ప్రైవేట్ బస్సులో 2 కిలోల బంగారు బ్యాగుతో వచ్చిన వ్యక్తి.. తీరా హైదరాబాద్ చేరుకోగానే షాక్..!