స్వచ్ఛందంగా ఎన్నికల కోడ్ పాటిస్తాం.. సోషల్ మీడియా సంస్థల సంచలన నిర్ణయం

| Edited By:

Mar 21, 2019 | 4:35 PM

సాధారణంగా ఎన్నికలకు ఒక రోజు ముందు రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రచారం చేయకూడదు. పోలింగ్‌కి ఇంకా రెండు రోజులు ఉందంటే ఈ రాజు సాయంత్రానికే ప్రచారానికి బ్రేకులు పడతాయి. కానీ సామాజిక మాధ్యమాలకు ఎలాంటి నిబంధనలు ఉండేవి కాదు. ఎలక్షన్ ముందువరకు కూడా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఇది గతంలో మాట. అయితే ఈ సారి పొలిటికల్ ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ సోషల్ మీడియా సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు రాజకీయాల్లోనే కాదు. ప్రపంచ రాజకీయాల్లోనూ […]

స్వచ్ఛందంగా ఎన్నికల కోడ్ పాటిస్తాం.. సోషల్ మీడియా సంస్థల సంచలన నిర్ణయం
Follow us on

సాధారణంగా ఎన్నికలకు ఒక రోజు ముందు రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రచారం చేయకూడదు. పోలింగ్‌కి ఇంకా రెండు రోజులు ఉందంటే ఈ రాజు సాయంత్రానికే ప్రచారానికి బ్రేకులు పడతాయి. కానీ సామాజిక మాధ్యమాలకు ఎలాంటి నిబంధనలు ఉండేవి కాదు. ఎలక్షన్ ముందువరకు కూడా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఇది గతంలో మాట. అయితే ఈ సారి పొలిటికల్ ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ సోషల్ మీడియా సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు రాజకీయాల్లోనే కాదు. ప్రపంచ రాజకీయాల్లోనూ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

అయితే ఈసారి ఎన్నికల కమీషన్ సోషల్ మీడియాపైన కూడా నిబంధనలు విధించింది. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు 48గంటల ముందు తమ మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారాలను నిలిపివేస్తామంటూ ఫేస్‌బుక్‌, ట్విటర్‌, టిక్ టాక్ సంస్థలు స్వచ్చందంగా ప్రకటించాయి. ఇప్పటి నుంచి తాము కూడా ఎన్నికల కోడ్‌ను పాటిస్తామని సోషల్‌మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ మేరకు ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియా (IAMAI) నేతృత్వంలో జరిగిన భేటిలో కార్యాచరణను ఎన్నికల సంఘంకు తెలిపాయి.

ఆన్‌లైన్‌ ప్రచారంను నిలువరిస్తామంటూ ఇంటర్నెట్‌ ఆధారిత సోషల్ మీడియా సంస్థలు హామీ ఇవ్వడం ఇదే తొలిసారి. దీనిపై ఎన్నికల ప్రధాన అధికారి సునిల్‌ అరోరా హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలు ముందుకు రావడం మంచి పరిణామమని అన్నారు. నిబంధలను ఉల్లంఘించిన వారిపై సత్వర చర్యలు తీసుకుంటామని, 1951 చట్టం 126 సెక్షన్ ప్రకారం సోషల్ మీడియాలో కూడా చర్యలు ఉంటాయని చెప్పారు. ఇచ్చిన హామీలకు ఆయా సంస్థలు కట్టుబడి ఉండాలని ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా స్పష్టం చేశారు.