హెలికాప్ట‌ర్‌లో మాజీ సీఎం.. ల‌గేజీ తనిఖీ చేసిన ఈసీ స్క్వాడ్

బెంగళూరు : బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప లగేజీని ఎన్నికల కమిషన్ ప్లయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీ చేసింది. శివమొగ్గ హెలిప్యాడ్ వద్ద ఆయన హెలికాప్టర్ ఎక్కుతుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ హుటాహుటిన అక్కడకు చేరుకుంది. ఆయన తీసుకువెళ్తున్న బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ఇటీవ‌ల క‌ర్నాట‌క‌లో ప్రధాని మోదీ ప్ర‌యాణించిన హెలికాప్ట‌ర్ నుంచి ఓ న‌ల్ల‌టి ట్రంకు బాక్స్‌ని తీసుకువెళ్లిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. బీజేపీ నేత‌లు ఆ బాక్స్‌లో […]

హెలికాప్ట‌ర్‌లో మాజీ సీఎం.. ల‌గేజీ తనిఖీ చేసిన ఈసీ స్క్వాడ్

Edited By:

Updated on: Apr 16, 2019 | 6:15 PM

బెంగళూరు : బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప లగేజీని ఎన్నికల కమిషన్ ప్లయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీ చేసింది. శివమొగ్గ హెలిప్యాడ్ వద్ద ఆయన హెలికాప్టర్ ఎక్కుతుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ హుటాహుటిన అక్కడకు చేరుకుంది. ఆయన తీసుకువెళ్తున్న బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ఇటీవ‌ల క‌ర్నాట‌క‌లో ప్రధాని మోదీ ప్ర‌యాణించిన హెలికాప్ట‌ర్ నుంచి ఓ న‌ల్ల‌టి ట్రంకు బాక్స్‌ని తీసుకువెళ్లిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. బీజేపీ నేత‌లు ఆ బాక్స్‌లో డ‌బ్బులు త‌ర‌లించార‌ని కాంగ్రెస్ ఆరోపించింది. కొన్ని రోజుల క్రితం సీఎం కుమార‌స్వామి కారును కూడా చెక్ చేసిన విష‌యం తెలిసిందే.