‘చెల్లెమ్మ’ మమతకు బెంగాల్ గవర్నర్ జగ దీప్ ధన్ కర్ సందేశం, అది తన ప్రయారిటీ కాదన్న దీదీ

| Edited By: Phani CH

May 05, 2021 | 3:41 PM

బెంగాల్ గవర్నర్ జగ దీప్ ధన్ కర్, సీఎం మమతా బెనర్జీ మధ్య విభేదాలు మళ్ళీ కనిపించాయి. రాష్ట్ర సీఎంగా మమత బుధవారం మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గవర్నర్ ఆమెకు ఓ సందేశం పంపారు.

చెల్లెమ్మ మమతకు బెంగాల్ గవర్నర్ జగ దీప్ ధన్ కర్ సందేశం, అది తన ప్రయారిటీ కాదన్న దీదీ
Mamata Banerjee And Governor Jagdeep Dhankhar
Follow us on

బెంగాల్ గవర్నర్ జగ దీప్ ధన్ కర్, సీఎం మమతా బెనర్జీ మధ్య విభేదాలు మళ్ళీ కనిపించాయి. రాష్ట్ర సీఎంగా మమత బుధవారం మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గవర్నర్ ఆమెకు ఓ సందేశం పంపారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసను తన సందేశంలో ప్రస్తావించిన ఆయన.. అర్థ రహితమైన, దారుణమైన హింసకు స్వస్తి చెప్పాలన్నదే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత కావాలన్నారు. ముఖ్యమంత్రి అత్యవసర ప్రాతిపదికపై బెంగాల్ లో శాంతి భద్రతల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇది తన ఆశ అని, యంగర్ సిస్టర్ (చెల్లి) ఈ సందర్భానికి అనుగుణంగా నడచుకోగలరని భావిస్తున్నానని ఆయన అన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా మీరు తగిన చర్యలు తీసుకోగలరని కూడా ఆశిస్తున్నానన్నారు. మూడో సారి ముఖ్యమంత్రి అయినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా అన్నారు. మీ ప్రభుత్వ పాలన రాజ్యాంగ బద్ధంగా నడుస్తుందని భావిస్తున్నా అని కూడా అన్నారాయన. కానీ ‘చెల్లెమ్మ ‘ మనోగతం మరోలా ఉంది. తన ప్రయారిటీ మొదట కోవిడ్ ని అదుపు చేయడమని, ఇందుకు ఉన్నతాధికారులతో సమావేశమై చర్చిస్తానని మమతా బెనర్జీ అన్నారు. ఆ తరువాత తన అజెండాలో రెండో అంశం బెంగాల్ లో లా అండ్ ఆర్డర్ ని పరిరక్షించడమన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి చెందడంతో బీజేపీ హింసను రెచ్చగొట్టిందని, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టిస్తోందని ఆమె ఆరోపించారు.
పైగా తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగడమే కాక, తృణమూల్ కాంగ్రెస్ వర్గీయులు తమ కార్యకర్తలపై హింసకు దిగుతున్నారని ప్రత్యారోపణ చేస్తోందని ఆమె అన్నారు. ఏమైనా రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూస్తామనని ఆమె చెప్పారు. హింసకు తావు లేకుండా చూస్తామన్నారు. ఆదివారం జరిగిన హింసలో 12 మంది మరణించినా ఆమెలో స్పందన లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా బీజేపీ కార్యాలయాలకు కొందరు నిప్పు కూడా పెట్టారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటన మొక్కుబడిగా సాగింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Nivetha Thomas : ఆక‌ట్టుకునే అందం, అదిరిపోయే అభిన‌యం.. అయినా అవ‌కాశాలు మాత్రం….

CS Somesh Kumar: తెలంగాణలో లాక్ డౌన్ ఉండబోదు.. ఇతర రాష్ట్రాలతో పోల్చితే కరోనా అదుపులోనే ఉందిః సీఎస్