సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి చర్యలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో ఉన్న రాజకీయపరమైన 63,000 బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగులను తొలగించారు. ఢిల్లీలో మే 12న ఆరవ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ‘‘ఎన్నికల షెడ్యూల్ వెలువడిన 72 గంటల్లో ఢిల్లీలోని ప్రజా ప్రదేశాల్లో ఉన్న మొత్తం 63,449 హోర్డింగులు, బ్యానర్లు, పోస్టర్లను తొలగించాం’’ అని ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి తెలిపారు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో ఉన్న 30,533 ప్రచార హోర్డింగులు తొలగించినట్లు పేర్కొన్నారు.