ఆంధ్రా.. అప్పుల రాష్ట్రంగా మారింది.. ఉద్యోగులకు జీతాలు కూడా కష్టమే.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్

|

Mar 19, 2022 | 5:54 PM

ఏపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్‌ చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఆంధ్ర రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిందని విమర్శించారు.

ఆంధ్రా.. అప్పుల రాష్ట్రంగా మారింది.. ఉద్యోగులకు జీతాలు కూడా కష్టమే.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్
Union Minister Kishan Reddy
Follow us on

Kishan Reddy: ఏపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్‌ చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఆంధ్ర రాష్ట్రం(Ap State) అప్పుల రాష్ట్రంగా మారిందని విమర్శించారు. ఎక్కడ అప్పులు పుడతాయా అనే స్థితిలోకి ఏపీ వెళ్లిందని కామెంట్‌ చేశారు కిషన్‌రెడ్డి. అప్పులు చేసి ఎన్నాళ్లు నెట్టుకువెళ్తారని ప్రశ్నించారు. పాలన ఇలాగే  కొనసాగితే భవిష్యత్‌లో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదన్నారు.  రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిందని ఆరోపించారు . రాష్ట్రంలో ల్యాండ్, లిక్కర్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని చెప్పారు. ఏపీలో జనసేన(Janasena)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీలో చేరేవారిని వేధిస్తున్నారంటూ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు కిషన్ రెడ్డి. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని స్పష్టం చేశారు. ఏపీలో మాఫియా కల్చర్‌ పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వం ఎక్కువ కాలం నిలబడదని కామెంట్‌ చేశారు.

Also Read: మద్యం నింపిన కొబ్బరి బోండాలతో పబ్‌‌కు.. గచ్చిబౌలి యాక్సిడెంట్‌కు సంబంధించి నిర్ఘాంతపోయే విషయాలు