Sonia-Ramdas: సోనియాగాంధీ ప్రధాని అయితే బాగుండేది.. కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..

2004లోనే సోనియాగాంధీ ప్రధాని పదవి చేపట్టి ఉండాల్సిందని సంచలన వ్యాఖ్యలు చేశారు రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ రామ్‌దాస్‌ అథవాలే. ఆమె విదేశీ మూలాల..

Sonia-Ramdas: సోనియాగాంధీ ప్రధాని అయితే బాగుండేది.. కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..
Sonia Ramdas Athawale

Updated on: Sep 27, 2021 | 3:33 PM

2004లోనే సోనియాగాంధీ ప్రధాని పదవి చేపట్టి ఉండాల్సిందని సంచలన వ్యాఖ్యలు చేశారు రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు రామ్‌దాస్‌ అథవాలే. సోనియా విదేశీ మూలాల వాదనకు అర్థం లేదని రామ్‌దాస్‌ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అమెరికా వైఎస్‌ ప్రెసిడెంట్‌ కమల హ్యారిస్‌ను ప్రస్తావించారు. యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు.. సోనియాగాంధీ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టాలని తాను ప్రతిపాదించినట్టు తెలిపారు.

ఇండో అమెరికన్‌ మూలాలున్న కమలా హ్యారిస్ అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పుడు.. సోనియాగాంధీ మన దేశానికి ఎందుకు ప్రధాని కాకూడదని రామ్‌దాస్‌ ప్రశ్నించారు. ఆమె రాజీవ్‌గాంధీ సతీమణి.. లోక్‌సభ సభ్యురాలని రామ్‌దాస్‌ అన్నారు. 2004లో మన్మోహన్‌సింగ్‌ను కాకుండా శరద్‌పవార్‌ను పీఎంను చేస్తే బావుండేదన్నారు రామ్‌దాస్‌.

ఇవి కూడా చదవండి:  AP Government: ఇక ఏపీలో అది కుదరదంటే.. కుదరదు.. కొత్త చట్టం తీసుకొచ్చే యోచనలో సర్కార్..

Elon Musk: ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు బ్రేకప్ చెప్పాడు.. 3 ఏళ్ల బంధం విడిపోవడానికి కారణం అదేనట..