కాంగ్రెస్ నా రక్తంలో ఉంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ నా రక్తంలో ఉందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అందరూ వేరని, తానూ వేరని.. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారనని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్‌గా వేరే వారికి అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ ఎన్నికల తరువాత తాను అధిష్టానానికి చెప్పానని.. అయితే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు తనను కొనసాగమని చెప్పారని ఆయన అన్నారు. కాంగ్రెస్ లీడర్లు పార్టీ మారడానికి తాను కారణం కాదని.. వారి వారి కారణాలతోనే […]

కాంగ్రెస్ నా రక్తంలో ఉంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Edited By:

Updated on: Apr 08, 2019 | 11:55 AM

కాంగ్రెస్ నా రక్తంలో ఉందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అందరూ వేరని, తానూ వేరని.. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారనని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్‌గా వేరే వారికి అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ ఎన్నికల తరువాత తాను అధిష్టానానికి చెప్పానని.. అయితే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు తనను కొనసాగమని చెప్పారని ఆయన అన్నారు. కాంగ్రెస్ లీడర్లు పార్టీ మారడానికి తాను కారణం కాదని.. వారి వారి కారణాలతోనే పార్టీని వీడారని ఉత్తమ్ చెప్పారు. టీఆర్‌ఎస్ ఎంపీలందరూ కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.6వేలు ఇస్తానని మాటిచ్చారని.. దానికి ప్రతి ఒక్కరు ఆకర్షితులవుతున్నారని.. ఎంపీగా తాను ఈ ఎన్నికల్లో గెలుస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.