ఊర్మిళ పోటీపై వీడిన సస్పెన్స్

| Edited By:

Mar 29, 2019 | 11:59 AM

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ పోటీపై సస్పెన్స్ వీడింది. ముంబై నార్త్ లోక్‌సభ అభ్యర్థిగా ఊర్మిళను బరిలో నిలపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు సీఈసీ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జి ముకుల్ వాస్నిక్ అధికారిక ప్రకటన జారీ చేశారు. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎంపీ అభ్యర్థిగా ఊర్మిళ మటోండ్కర్ అభ్యర్థిత్వాన్ని ఆమోదించిందని ఆయన వెల్లడించారు. కాగా బుధవారం కాంగ్రెస్‌లో చేరిన ఊర్మిళ అప్పుడే మోదీపై విమర్శనాస్త్రాలు […]

ఊర్మిళ పోటీపై వీడిన సస్పెన్స్
Follow us on

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ పోటీపై సస్పెన్స్ వీడింది. ముంబై నార్త్ లోక్‌సభ అభ్యర్థిగా ఊర్మిళను బరిలో నిలపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు సీఈసీ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జి ముకుల్ వాస్నిక్ అధికారిక ప్రకటన జారీ చేశారు. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎంపీ అభ్యర్థిగా ఊర్మిళ మటోండ్కర్ అభ్యర్థిత్వాన్ని ఆమోదించిందని ఆయన వెల్లడించారు.

కాగా బుధవారం కాంగ్రెస్‌లో చేరిన ఊర్మిళ అప్పుడే మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. మోదీ వ్యక్తిగతంగా మంచి వ్యక్తేనని కానీ ప్రధానిగా ఆయన అనుసరిస్తున్న విధానాలే మంచివి కావని ఆమె విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఏం తినాలో, ఏం మాట్లాడాలో నిర్ణయించుకునే హక్కును మోదీ కాలరాశారని ఆమె విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే.