సోనియా, రాహుల్, ప్రియాంక వ్యాక్సిన్ తీసుకున్నారా? ఫుల్ క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్

|

Jun 17, 2021 | 3:24 PM

కొవిడ్ వ్యాక్సిన్ల కొరతపై కాంగ్రెస్-బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దేశంలో నెలకొన్న వ్యాక్సిన్ల కొరతపై మోదీ సర్కారును కాంగ్రెస్ నేతలు నిలదీస్తుండగా... అసలు సోనియాగాంధీ వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో చెప్పాలంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

సోనియా, రాహుల్, ప్రియాంక వ్యాక్సిన్ తీసుకున్నారా? ఫుల్ క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
Sonia Gandhi
Follow us on

Sonia Gandhi – Rahul Gandhi: కొవిడ్ వ్యాక్సిన్ల కొరతపై కాంగ్రెస్-బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దేశంలో నెలకొన్న వ్యాక్సిన్ల కొరతపై మోదీ సర్కారును కాంగ్రెస్ నేతలు నిలదీస్తుండగా… అసలు సోనియాగాంధీ వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో చెప్పాలంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జెవాలా దీనిపై క్లారిటీ ఇచ్చారు. సోనియా గాంధీ రెండు డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. కొవిడ్ నుంచి కోలుకున్న రాహుల్ గాంధీ వైద్యుల సూచన మేరకు త్వరలోనే తొలి డోసు వ్యాక్సిన్ తీసుకోనున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు సమస్యను అనవసరమైన అంశాల వైపు దారి మళ్లించే ప్రయత్నాలను మానుకోవాలని హితవుపలికారు. ప్రభుత్వం తన రాజధర్మంతో దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ల కొరతపై ప్రశ్నిస్తే… సోనియాగాంధీ వ్యాక్సిన్ తీసుకున్నారా? అని బీజేపీ నేతలు ప్రశ్నించడం అర్థరహితమని మండిపడ్డారు. ఆరోపించారు. సోనియాగాంధీ రెండు డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న విషయం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు తెలిసి ఉండాలని అభిప్రాయపడ్డారు.

ప్రతి రోజూ 80 లక్షల నుంచి కోటి మంది ప్రజలకు వ్యాక్సినేషన్ చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారిస్తే మంచిదని రణ్‌దీప్ సుర్జెవాలా హితవుపలికారు.. తద్వారా ఈ ఏడాది చివరి నాటికి 100 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు. సెకండ్ వేవ్‌ను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని వ్యాక్సినేషన్‌లో ఘోర వైఫల్యానికి మోదీ సర్కారు, ఆరోగ్య శాఖ మంత్రి పూర్తి బాధ్యతవహించాలని డిమాండ్ చేశారు. వీరి చేతగానితనం కారణంగా రాబోతున్న థర్డ్ వేవ్‌లో లక్షలాది మంది దేశ ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నట్లు వ్యాఖ్యానించారు.

దేశంలోని దాదాపు 140 కోట్ల మంది జనాభాలో జనవరి 16 నుంచి జూన్ 16 వరకు కేవలం 3.51 శాతం మందికి మాత్రమే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని అసంతృప్తి వ్యక్తంచేశారు. గత ఆరు మాసాల్లో సగటున రోజుకు 17.23 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్లు ఇస్తున్నట్లు విమర్శించారు. ఇదే పరిస్థితి కొనసాగితే వ్యాక్సినేషన్ పూర్తయ్యేందుకు రెండున్నరేళ్లు (2024 జనవరి 16) పట్టే అవకాశముందన్నారు. వ్యాక్సిన్ల కోసం దేశం అన్ని రోజులు ఆగే పరిస్థితి లేదన్నారు. ఈ కీలకమైన అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ నేతలు..సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వ్యాక్సిన్లు వేసుకున్నారా? అంటూ అర్ధరహిత ప్రశ్నలు వేస్తున్నారని రణ్‌దీప్ మండిపడ్డారు.

Also Read..దారుణం.. కోవిడ్ మృతుడి ఏటీఎం కార్డు చోరీ.. ఆ తర్వాత లక్షలు మాయం చేసిన సిబ్బంది

 ఆత్మస్థైర్యం ఉంటే అంగవైకల్యం ఓ లెక్కా అంటున్న ఓ యువతి..ఒంటి కాలితో సూపర్ హిట్ సాంగ్ కు డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా