తెలంగాణ సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణగౌడ్ ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందారు. ఈ రోజు దశదినకర్మ కావడంతో సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను, వారి తల్లిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు.
రోడ్డు మార్గం ద్వారా శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని చూసేందుకు అభిమానులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జిల్లా పోలీస్ యంత్రంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను సీఎం కేసీఆర్ పరామర్శించిన అనంతరం నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నారాయణ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు.
Read more: