నిరుద్యోగులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి.. ఆ పార్టీలకు కీలెరిగి వాత పెట్టాలి -భట్టి, జీవన్‌రెడ్డి

తెలంగాణ ప్రజల ను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని సీఎల్పీ లీడర్‌ మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. ఐ.టీ.ఐ.ఆర్ ప్రాజెక్టు వల్ల లక్షల మందికి

నిరుద్యోగులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి.. ఆ పార్టీలకు కీలెరిగి వాత పెట్టాలి -భట్టి, జీవన్‌రెడ్డి
Bhatti
Follow us

|

Updated on: Mar 06, 2021 | 5:06 PM

తెలంగాణ ప్రజల ను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని సీఎల్పీ లీడర్‌ మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. ఐ.టీ.ఐ.ఆర్ ప్రాజెక్టు వల్ల లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించడం లో టీ.ఆర్.ఎస్ వైఫల్యం చెందిందని విమర్శించారు. ఏడేళ్లలో.. యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాజెక్టును ఏ ఒక్క రోజు అడగలేదు. తెలంగాణపై ప్రేమ లేని బీజేపీ.. ఐ.టీ.ఐ.ఆర్ గాలికొదిలేసింది. ఇద్దరూ కలిసి తెలంగాణ యువతను మోసం చేశారని భట్టి విమర్శించారు.

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో యువత.. రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కరెక్ట్ గా బుద్ధి చెబితే తప్ప.. రెండు పార్టీలు దారిలోకి రావన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి.. మధ్యతరగతి ప్రజల వెన్ను విరుస్తోంది కేంద్రం. సమాజాన్ని పీడిస్తున్న బీజేపీ, టీ.ఆర్.ఎస్ లకు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు. రేపటి నుంచి మహబూబాబాద్ , ఖమ్మం లోక్ సభ స్థానాల పరిధిలో తాను , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ప్రచారం చేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు.

తెలంగాణ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ఐ.టీ.ఐ.ఆర్ వల్ల ప్రత్యక్షంగా 15 లక్షల మందికి…పరోక్షంగా 50 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే ప్రాజెక్టు అని కానీ ఇద్దరూ కలిసి ఆ ప్రాజెక్టు రాకుండా చేశారని భట్టి విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించడం లో టీ.ఆర్.ఎస్ వైఫల్యం చెందిందన్నారు. మేము మూడేళ్లు ఉంటాం అని మంత్రులు ఉద్యోగులను బెదిరిస్తున్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంగిస్తున్న మంత్రులు పై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని భట్టి డిమాండ్‌ చేశారు.

నిరుద్యోగులకు ఉపాధి ఇవ్వాలని UPA ప్రభుత్వం ITIR ఇచ్చింది. కానీ బీజేపీ ప్రభుత్వం ITIR ని నిరుగార్చిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. . ITIRను నీరుగార్చడం లో కేసీఆర్.. మోడీ ఇద్దరూ దోషులేనన్నారు. కేంద్రానికి అన్నిటికి మద్దతు పలికిన కేసీఆర్… ITIR ఎందుకు సాధించలేదని ప్రశ్నించారు. బీజేపీ కి బీ టీం లెక్క మారింది trs అని జీవన్‌రెడ్డి విమర్శించారు. . సొంత ప్రయోజనాల కోసం మోడీకి కేసీఆర్ వంతపాడారని అన్నారు.

ITIR ఇవ్వకపోతే ఇంకో ప్రాజెక్ట్ ఇవ్వండి అని మంత్రి కేటీఆర్‌ అడగడం ఏంటని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుకు పని చేసిన ఉద్యోగులు…నిరుద్యోగులు ఆలోచించి ఓటేయాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ కి ప్రతీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు టీ.ఆర్.ఎస్ మద్దతు తెలిపింది. టీ.ఆర్.ఎస్ , బీజేపీ తోడు దొంగల పార్టీ. తమ అవినీతి ని కప్పి పుచ్చుకోవడం కోసమే మోదీ తో అంటకాగారు. రాష్ట్ర ప్రయోజనాల ను టీ.ఆర్.ఎస్ పూర్తిగా గాలికొదిలేసింది. యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తు గా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తీర్పునివ్వాలని అన్నారు.

ఈ ఎన్నికలను ఒక అవకాశం గా తీసుకొని .. పట్టభద్రులు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని జీవన్‌రెడ్డి కోరారు. పీవీ నర్సింహారావు ను కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ని చేసింది.. ఆయన కూతురు.. పీవీని విమర్శించిన పార్టీ నుంచి పోటీ చేయడం బాధాకరం. గ్రాడ్యుయేట్‌ ఓటర్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ శాపనార్ధాలు పెడుతూ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే టీ.ఆర్.ఎస్ ఓడిపోతుందని స్పష్టమైందని జీవన్‌రెడ్డి అన్నారు. మంత్రి వ్యాఖ్యలు.. ఎన్నికల నియమావళి ని ఉల్లంఘించాయి.. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జీ.హెచ్.ఎం.సీ మేయర్ విజయలక్ష్మి.. సిటీలో తరచూ కరెంట్ కోతలున్నాయని చేసిన వ్యాఖ్యలు.. ప్రభుత్వ డొల్ల తనాన్ని బయట పెడుతుందని చెప్పారు.

Read More:

దూషణలపై వడ్డీతో సహా సమాధానం.. అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని టీఆర్‌ఎస్వీకి కేటీఆర్ మార్గనిర్దేశం