హోలీ పండుగ వచ్చేసిందని, అయితే కరోనా వైరస్ కారణంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ఈ సంబరాలు చేసుకునే బదులు వారంతా తమ ఇళ్లలోనే రంగుల పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. నగరంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల కారణంగా తాను ఏ ప్రజాసంబంధహోలీ కార్యక్రమాల్లోనూ పాల్గొనబోనని, గుంపులుగా కాకుండా తమ కుటుంబాలతో ప్రజలు తమ ఇళ్లలోనే వీటిని నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం ఒక్క రోజే ఢిల్లీలో 1558 కేసులు కొత్తగా నమోదయ్యాయి. (గత డిసెంబరు15 న1617 కేసులు నమోదైన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు). కరోనా నివారణకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని కేజ్రీవాల్ కోరారు. హోలీ, నవరాత్రి వంటి పండుగల సందర్భంగా నగరంలో ప్రజా సంబంధ సెలబ్రేషన్స్ ఉండబోవని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను, మార్గదర్శక సూత్రాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ కూడా ఓ ప్రకటనలో కోరింది.
జిల్లా వారీ టీమ్ లను జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసులు ఏర్పాటు చేశారని, ప్రభుత్వ ఆదేశాలను పాటించనివారి పట్ల ఈ బృందాలు కఠిన చర్యలు తీసుకుంటాయని ఈ సంస్థ హెచ్చరించింది. అలాగే నగర పోలీసులు కూడా ఓ అడ్వైజరీ ఆర్డర్ జారీ చేస్తూ…. ప్రజలు బయటకి గుంపులుగా వచ్చి హొలీ ఆడిన పక్షంలో లీగల్ గా కూడా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. గ్రౌండ్లు, పార్కులు తదితర బహిరంగ ప్రదేశాల్లో హోలీ ఆడకూడదన్నారు . ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించేలా చూడాలని చీఫ్ సెక్రటరీ విజయ్ దేవ్ అధికారులను ఆదేశించారు. అటు- ప్రొటొకాల్స్ ను ఉల్లంఘించేవారిపై కేసులు పెట్టే యోచన ఉందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కేవలం హోలీకే కాక ఇతర పండుగలకు కూడా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని ఇక్కడ చదవండి:Holi 2021: హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా ? రంగుల వేడుక ప్రాముఖ్యత.. పురాణాల ప్రకారం..
AP Crime News: మహిళల పొదుపు నిధులను మింగేశారు.. ఏకంగా కోటి 75లక్షలు కాజేశారు…!