బీజేపీ ‘ఐటీ సెల్‌’గా ప్రభుత్వ ఏజెన్సీలు: తేజస్వి

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇన్‌కమ్ టాక్స్ (ఐటీ) విభాగాలు భారతీయ జనతా పార్టీకి ‘ఐటీ సెల్’ మాదిరి పనిచేస్తున్నాయని బీఎస్‌పీ సుప్రీం మాయవతి చేసిన వ్యాఖ్యలను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శనివారంనాడు సమర్ధించారు. మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ సీబీఐ శుక్రవారంనాడు కేసు నమోదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏడు చక్కెర మిల్లుల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీంతో రూ.1,179 కోట్ల మేర […]

బీజేపీ ఐటీ సెల్‌గా ప్రభుత్వ ఏజెన్సీలు: తేజస్వి

Edited By:

Updated on: Apr 27, 2019 | 1:39 PM

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇన్‌కమ్ టాక్స్ (ఐటీ) విభాగాలు భారతీయ జనతా పార్టీకి ‘ఐటీ సెల్’ మాదిరి పనిచేస్తున్నాయని బీఎస్‌పీ సుప్రీం మాయవతి చేసిన వ్యాఖ్యలను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శనివారంనాడు సమర్ధించారు. మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ సీబీఐ శుక్రవారంనాడు కేసు నమోదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏడు చక్కెర మిల్లుల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీంతో రూ.1,179 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడిందని సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనిపై మాయావతి శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ ఏజెన్సీలు బీజేపీ ‘జేబుసంస్థ’గా మారాయని ఆరోపించారు. ఆమె ఆరోపణలను తేజస్వి సమర్ధించారు.