టీటీడీ పాలకమండలికి బొండా, పార్థసారధి రాజీనామా

అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, బీకే పార్థసారధి మంగళవారం టీటీడీ పాలకమండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో విజయవాడ సెంట్రల్‌ నుంచి బొండా ఉమామహేశ్వరరావు, అనంతపురం జిల్లా పెనుకొండ నుంచి బీకే పార్థసారథి పోటీ చేస్తున్నారు. టీటీడీ బోర్డులో కొనసాగితే నామినేషన్ తిరస్కరణకు గురవుతుందన్న భావనతో వారు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. టీటీడీతో పాటు ఏపీ ప్రభుత్వం వీరి రాజీనామాలను వెంటనే ఆమోదించింది.

Updated on: Mar 19, 2019 | 8:37 PM