బొడ్డు భాస్కర్ రావు వైసీపీలో చేరబోతున్నారా?
తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో టెన్షన్ మొదలైంది. జిల్లాలోని సీనియర్ నేత అయిన బొడ్డు భాస్కర్ రామారావు పార్టీని వీడబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. 2014 వరకు టీడీపీలో ఒక వెలుగు వెలిగిన బొడ్డు భాస్కర్ రావు.. ఒక్కసారిగా వైసీపీలోకి జంప్ చేశారు. కుమారుడికి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నాడు. కానీ.. ఓటమి ఎదురవడంతో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. కానీ.. అప్పటికే పెద్దాపురంలో మాజీ హోమంత్రి చిన రాజప్ప అక్కడ సెటిల్ అవ్వడంతో ఈ ఐదేళ్ల పాటు […]
తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో టెన్షన్ మొదలైంది. జిల్లాలోని సీనియర్ నేత అయిన బొడ్డు భాస్కర్ రామారావు పార్టీని వీడబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. 2014 వరకు టీడీపీలో ఒక వెలుగు వెలిగిన బొడ్డు భాస్కర్ రావు.. ఒక్కసారిగా వైసీపీలోకి జంప్ చేశారు. కుమారుడికి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నాడు. కానీ.. ఓటమి ఎదురవడంతో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. కానీ.. అప్పటికే పెద్దాపురంలో మాజీ హోమంత్రి చిన రాజప్ప అక్కడ సెటిల్ అవ్వడంతో ఈ ఐదేళ్ల పాటు మళ్లీ పెద్దాపురంలో పాగా వేయడానికి పావులు కదుపుతూ వచ్చారు. కానీ చంద్రబాబు చినరాజప్పకే మళ్లీ టికెట్ ఇచ్చారు. అయితే టీడీపీ అధికారం కోల్పోవడంతో బొడ్డు మళ్లీ వైసీపీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే బొడ్డు భాస్కరరావు వైసీపీలో చేరడానికి.. పెద్దాపురం వైసీపీ ఇంఛార్జ్ బాధ్యతలు తనకే ఇవ్వాలని షరతు పెట్టారు. అయితే ఇప్పటికే పెద్దాపురంలో హౌస్ ఫుల్ అయింది. ఇలాంటి పరిస్థితిలో బొడ్డు భాస్కర్ రావుకి పెద్ద పీట వేస్తారా అన్న చర్చ కూడా వైసీపీలో సాగుతోంది.