మానవత్వం చాటుకున్న బొబ్బిలి సీఐ.. వృద్ధురాలిని పోలింగ్‌ కేంద్రం వరకు ఎత్తుకెళ్లిన కేశవరావు

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల విధుల్లో భాగంగా ఓ సీఐ తన మానవత్వాన్ని చాటుకున్నారు. విజయనగరం..

మానవత్వం చాటుకున్న బొబ్బిలి సీఐ.. వృద్ధురాలిని పోలింగ్‌ కేంద్రం వరకు ఎత్తుకెళ్లిన కేశవరావు

Updated on: Feb 17, 2021 | 5:13 PM

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల విధుల్లో భాగంగా ఓ సీఐ తన మానవత్వాన్ని చాటుకున్నారు. విజయనగరం జిల్లా మెరక ముడిదం మండలం గర్భాం గ్రామ మేజర్ పంచాయతీ ఎలక్షన్ పోలింగ్ సమయంలో.. బొబ్బిలి టౌన్ సిఐ ఈ.కేశవరావు ఓ వృద్ధురాలికి ఆసరగా నిలిచారు

ఓటింగ్ డ్యూటీ నిమిత్తం… వృద్ధురాలు నడవటానికి ఇబ్బంది పడుతుండం గమనించిన సీఐ కేశవరావు.. ఆ వృద్ధురాలికి చేయూతనిచ్చి పోలింగ్ స్టేషన్‌ వరకు తీసుకొచ్చారు. ఈ సంఘటన ద్వారా పోలీస్ వారికి ఉన్న గొప్పతనాన్ని మరొకసారి నిరూపించుకున్నారు.

పోలింగ్ సమయంలో పోలీసులు భద్రతాపరమైన విధులే కాకుండా ఇలాంటి వృద్ధులు, వికలాంగ ఓటర్లకు సాయపడటం వంటి దృశ్యాలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి. పోలీసుల సేవా దృక్పథం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Read more:

సీఎం జగన్‌తో విశాఖ స్టీల్‌ కార్మికుల భేటీ.. కార్మిక సంఘాలకు ఇచ్చిన ఆ కీలక హామీ ఏంటో తెలుసా..?