Vijayashanthi : ‘ఏమీ లేకపోయినా.. అరచేతిలో స్వర్గం చూపించే ఘనులు’ : విజయశాంతి

|

Jul 28, 2021 | 9:39 PM

బీజేపీ తెలంగాణ నాయకురాలు, సినీ నటి విజయశాంతి మరోమారు కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టారు. " ఏమీ లేకపోయినా అరచేతిలో స్వర్గం..

Vijayashanthi : ఏమీ లేకపోయినా.. అరచేతిలో స్వర్గం చూపించే ఘనులు : విజయశాంతి
Vijayashanthi
Follow us on

Vijayashanthi : బీజేపీ తెలంగాణ నాయకురాలు, సినీ నటి విజయశాంతి మరోమారు కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ” ఏమీ లేకపోయినా అరచేతిలో స్వర్గం చూపించే ఘనుల్లో టాప్ ర్యాంక్ ఎవరికైనా ఇవ్వాలంటే అందుకు అన్ని అర్హతలూ ఉన్న ఏకైక వ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్ గారు మాత్రమే. ఒక పక్క తెలంగాణ ఖజానా ఖాళీ అయినా.. గతంలో ఇచ్చినా హామీలు నెరవేర్చలేకపోయినా.. కేటీఆర్ గారినే ముఖ్యమంత్రిగా చేస్తే మేలని… అందరూ అనుకోవాలనే ఆలోచనతో కేసీఆర్ గారు ఇయ్యన్నీ చేస్తున్నారో తెలియదు. పై రెంటిలో కారణం ఏదైనా.. ఆ అవకతవక పరిపాలన కన్నా అదే మేలేమో అన్న అభిప్రాయాన్ని ఆ పార్టీకే చెందిన కొందరు వ్యక్తం చేస్తున్నారు.” అంటూ విజయశాంతి సంచలన కామెంట్ చేశారు.

ఇవిగాక, “ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఇన్సెంటివ్‌లు, గొర్రెల పంపిణీ యునిట్ విలువ పెంపు, 8 లక్షలకు పైగా ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగుకు ప్రోత్సాహం, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధుల పెంపు.. ఇలా చూసుకుంటూ పోతే పథకాలు, హామీలే తప్ప, వాటికి తగిన నిధుల సమీకరణ.. ఆ మేరకు ఆదాయం గానీ, కేటాయింపులు గానీ కానరాని పరిస్థితుల్లో తెలంగాణ ఖజానాను కుంగదీశారు. ధనిక రాష్ట్రమని చెబుతూ అప్పుల పాలు చేసిన ఈ తెలంగాణ సర్కారు తన తప్పుడు నిర్ణయాలతో తెలంగాణ ప్రజల భవితవ్యాన్ని అంధకారంలోకి నెడుతోంది.” అంటూ విజయశాంతి విమర్శించారు.

“దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని సీఎం గారు చెబితే నమ్మాలా? దీనికి తోడు కొత్త రేషన్ కార్డుల జారీ, వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సు పెంపు దిశగా తెలంగాణ సర్కారు ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఆసరా పింఛన్ చెల్లింపులు చెయ్యలేక కిందా మీదా పడుతున్నారు. ఆర్టీసీని అధోగతి పాలు చేశారు. మరోపక్క కరోనా లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగుల జీతాలు, పాలనాపరమైన ఖర్చుల కోసం దాదాపుగా ఇప్పటివరకూ రూ.21 వేల కోట్ల మేర అప్పులు చేశారు.” ఇలాంటి పరిస్థితుల్లో వేల కోట్ల రూపాయల నిధులతో ముడిపడిన సంక్షేమ పథకాలు అమలయ్యే అవకాశం ఉందాని విజయశాంతి అనుమానాలు వ్యక్తం చేశారు.

Read also : RS Praveen Kumar : జెండా ఎత్తుకుంటారా? కొత్త జెండాను ప్రకటిస్తారా? మాజీ ఐపీఎస్‌ RS ప్రవీణ్‌కుమార్‌ రూటెటు?