బీజేపీ రెబల్ ఎంపీ కాంగ్రెస్ టికెట్‌పై నుంచి పోటీ..?

| Edited By:

Mar 21, 2019 | 12:50 PM

బీహార్ : బీజేపీ రెబ‌ల్‌ ఎంపీ శ‌తృఘ్న సిన్హా.. ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్‌కు చెందిన ఎంపీ శ‌తృఘ్న‌.. పాట్నా సాహిబ్ నుంచి పోటీ చేయ‌నున్నారు. పార్టీలో ఉంటూనే ప్ర‌ధాని మోదీ తీరును వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్న శ‌తృఘ్న సిన్హా.. ఈసారి బీజేపీ పార్టీని వీడే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. మోదీపై శ‌తృఘ్న ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా.. బీజేపీ పార్టీ మాత్రం ఈ మాజీ ఫిల్మ్‌స్టార్‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. 2009, 2014 […]

బీజేపీ రెబల్ ఎంపీ కాంగ్రెస్ టికెట్‌పై నుంచి పోటీ..?
Follow us on

బీహార్ : బీజేపీ రెబ‌ల్‌ ఎంపీ శ‌తృఘ్న సిన్హా.. ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్‌కు చెందిన ఎంపీ శ‌తృఘ్న‌.. పాట్నా సాహిబ్ నుంచి పోటీ చేయ‌నున్నారు. పార్టీలో ఉంటూనే ప్ర‌ధాని మోదీ తీరును వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్న శ‌తృఘ్న సిన్హా.. ఈసారి బీజేపీ పార్టీని వీడే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. మోదీపై శ‌తృఘ్న ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా.. బీజేపీ పార్టీ మాత్రం ఈ మాజీ ఫిల్మ్‌స్టార్‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. 2009, 2014 సంవ‌త్స‌రాల్లో పాట్నా సాహిబ్ స్థానం నుంచే శ‌తృఘ్న గెలిచారు. ఈసారి కూడా ఇదే స్థానం నుంచి పోటీచేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

మరోవైపు ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. గత కొంతకాలంగా బీజేపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్న శతృఘ్న సిన్హాను కాంగ్రెస్ గూటికి చేరేలా పావులు కదుపుతోంది. ఈ ఎన్నికల్లో ఆయనకు పాట్నా సాహిబ్ నుంచి టికెట్ కేటాయించాలని కూడా కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తున్నట్టు సమాచారం. సిట్టింగ్ స్థానమైన పాట్నా సాహిబ్ నుంచే తాను తిరిగి బరిలోకి దిగనున్నట్టు శతృఘ్న సిన్హా ఇప్పటికే ప్రకటించారు. అయితే, బీజేపీ మాత్రం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ఆ స్థానంలో పోటీకి దించాలని భావిస్తోంది. గత కొంతకాలంగా బీజేపీపైనా, ప్రధాని మోదీపైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సిన్హా ఇటీవల బెంగాల్‌లో ప్రతిపక్షాలు నిర్వహించిన ఐక్యతా ర్యాలీలోనూ పాల్గొన్నారు.