MP GVL – CM Jagan: ఆ జిల్లాకు మహా పల్నాడుగా పేరు పెట్టండి.. సీఎం జగన్‌కు ఎంపీ జీవీఎల్ లేఖ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ లేఖ రాశారు. కొత్త నరసరావుపేట పార్లమెంట్ జిల్లాకు గ్రేటర్ పల్నాడు లేదా మహా పల్నాడు జిల్లాగా పేరు పెట్టాలని..

MP GVL - CM Jagan: ఆ జిల్లాకు మహా పల్నాడుగా పేరు పెట్టండి.. సీఎం జగన్‌కు ఎంపీ జీవీఎల్ లేఖ..
Mp Jgl Cm Jagan

Updated on: Jan 25, 2022 | 6:15 PM

MP GVL – CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ లేఖ రాశారు. కొత్త నరసరావుపేట పార్లమెంట్ జిల్లాకు గ్రేటర్ పల్నాడు లేదా మహా పల్నాడు జిల్లాగా పేరు పెట్టాలని లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల తరహాలో జిల్లాల పునర్వ్యవస్థీకరణను వేగవంతం చేయాలని కోరాశారు. ఇది చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నిర్ణయమని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో మెరుగైన పరిపాలన, వేగవంతమైన.. సమతుల్య అభివృద్ధి కోసం వీలైనంత త్వరగా అమలు చేయాలని జీవీఎల్ తన లేఖలో పేర్కొన్నారు.

నరసరావుపేట గొప్ప చరిత్ర, సంప్రదాయం కలిగిన పల్నాడు ప్రాంతానికి ముఖ ద్వారం కాబట్టి, నరసరావుపేట కేంద్రంగా కొత్త నరసరావుపేట జిల్లాకు “గ్రేటర్ పల్నాడు” లేదా “మహా పల్నాడు” జిల్లాగా పేరు పెట్టాలని ముఖ్యమంత్రిని కోరారు. ఇది ఈ ప్రాంతానికి ఉన్న గొప్ప చరిత్ర, సాంస్కృతిక గుర్తింపుకు తగిన గుర్తింపుగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతం వెనుకబాటు, అభివృద్ధి అవసరాలపై దృష్టి సారిస్తుందని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు .

ఇవి కూడా చదవండి: Telangana Corona: తెలంగాణలో నైట్ కర్ఫ్యూపై కీలక ప్రకటన.. క్లారిటీ ఇచ్చిన హెల్త్ డైరెక్టర్..

UP Election 2022: సమాజ్‌వాదీ పార్టీకి మరో షాక్, బీజేపీలో చేరిన జలాల్‌పూర్ ఎమ్మెల్యే..