MLA Raja Singh: దళితులతో పెట్టుకుంటే అంతే.. సీఎం కేసీఆర్ కామెంట్స్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్..

|

Feb 03, 2022 | 1:18 PM

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దళిత సోదరులతో పెట్టుకున్న సీఎం కేసీఆర్..

MLA Raja Singh: దళితులతో పెట్టుకుంటే అంతే.. సీఎం కేసీఆర్ కామెంట్స్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్..
BJP MLA Raja singh
Follow us on

దేశ భవిష్యత్తు కోసం రాజ్యాంగాన్ని మళ్లీ రాయాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR) చేసిన కామెంట్స్‌‌పై బీజేేపీ వర్గాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. బీజేపీతోపాటు ప్రతిపక్ష పార్టీల నేతలు కేసీఆర్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దళిత సోదరులతో పెట్టుకున్న సీఎం కేసీఆర్ సర్వనాశనం అయిపోతాడని ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని మార్చే దమ్ము సీఎం కేసీఆర్‌కు లేదని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. సీఎం కుర్చీలో కూర్చోపెట్టిన దళితులే కేసీఆర్‌ను కిందకు దించుతారని కామెంట్స్ చేశారు.

తిట్లు తిట్టడం ఎలా అనే పుస్తకాలను మాత్రమే సీఎం కేసీఆర్ చదువుతారని, బడ్జెట్ గురించి కాకుండా బీజేపీని తిట్టడం‌ కోసమే సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడతారని ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైర్లు వేశారు.

పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం దీనిపై మాట్లాడిన సీఎం కేసీఆర్‌ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఇప్పటికే బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా బీజేపీ పలు కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రణాళికలు చేసింది. అయితే ఈ దీక్ష ద్వారా కేసీఆర్‌ను రాజ్యాంగ ద్రోహిగా దేశల ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా సీఎం కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఈ అంశంపై పోరాడాలని వ్యూహం రచిస్తోంది.

ఇవి కూడా చదవండి: Funny Video: ఈ బాతు పిల్లల సరదా సందడి చూస్తే మీ చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తాయి.. ఈ వీడియోకు ఇప్పటికే 4 లక్షలకు పైగా వ్యూస్..

RBI Recruitment 2022: ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా.. చివరి తేదీ ఎప్పుడంటే..