ప్రముఖ సినీ నటి ప్రియా రామన్ బీజేపీలో చేరారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో.. ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రియా రామన్ మాట్లాడుతూ.. సమాజసేవ చేసేందుకే తను రాజకీయాల్లోకి వచ్చానని.. పదవులు తనకు ముఖ్యం కాదని, పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. అలాగే.. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై కూడా ఆమె ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. రోజా, తాను మంచి స్నేహితులమే కానీ.. పోటీ దారులం కాదని చెప్పారు. అలాగే.. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడాలని ప్రశ్నించగా.. ఈ అంశంపై ఇప్పుడే తానేమీ మాట్లాడలేనని చెప్పారు.