బిహార్ బాహుబలి..! గ్యాంగ్‌స్టర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ఎదిగాడు.. కానీ కరోనాకు బలయ్యాడు..?

|

May 01, 2021 | 7:16 PM

Mohammad Shahabuddin : బీహార్‌ బాహుబలి, ఆర్జేడీ మాజీ ఎంపీ షాహాబుద్దీన్ కరోనాతో మరణించాడు. ఓ హత్యకు సంబంధించి

బిహార్ బాహుబలి..! గ్యాంగ్‌స్టర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ఎదిగాడు.. కానీ కరోనాకు బలయ్యాడు..?
Mohammad Shahabuddin Rjd
Follow us on

Mohammad Shahabuddin : బీహార్‌ బాహుబలి, ఆర్జేడీ మాజీ ఎంపీ షాహాబుద్దీన్ కరోనాతో మరణించాడు. ఓ హత్యకు సంబంధించి తిహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. బాహుబలి నాయకుడిగా పిలువబడే షాహాబుద్దీన్ నేర ప్రపంచంలో పెద్ద పేరు సంపాదించాడు. షాహాబుద్దీన్ 1986 నుంచి అంటే 19 సంవత్సరాల వయస్సులోనే నేర ప్రపంచంలో అడుగుపెట్టాడు. ఆ తరువాత 24-25 సంవత్సరాల వయస్సులో క్రియాశీల రాజకీయాలలో నిలిచాడు.

త్రిభువన్ నారాయణ్ 1985 లో కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యే అవుతాడు. షాహాబుద్దీన్ ఒక క్రిమినల్ కేసులో జైలుకు వెళ్ళవలసి వస్తోంది. ఓ సందర్భంలో త్రిభువన్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. దుండగులు, నేరస్థులకు తాను మద్దతు పలకనని బహిరంగంగా చెబుతాడు. తరువాత 1990 అసెంబ్లీ ఎన్నికలలో షాహాబుద్దీన్ స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ ఎన్నికల్లో కెప్టెన్ త్రిభువన్ నారాయణ్ సింగ్ ను ఓడిస్తాడు.

5 సంవత్సరాల తరువాత లాలూ ప్రసాద్ యాదవ్‌తో కలిసిపోయాడు. ముస్లిం-యాదవ్ ఓటర్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో 1991 లోక్‌సభ ఎన్నికల్లో జనతాదల్ భారీ విజయానికి దారితీసింది. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో షాహబుద్దీన్ రెండో సారి జిరదేయి నుంచి ఎమ్మెల్యే అవుతాడు. అనంతరం సంవత్సరం తరువాత 1996 లో ఎంపీ ఎన్నికల్లో గెలిచి లోక్‌సభకు ఎంపికవుతాడు. తన ప్రాంతంలో వామపక్షాల ఆధిపత్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి షాహబుద్దీన్ భయాన్ని ఉపయోగించాడు.

చోటే శుక్లా అనే వామపక్ష నాయకుడిని కిడ్నాప్ చేసి చంపాడు. అనంతరం 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ టికెట్‌పై పోటీ చేసి రెండోసారి ఎంపీ అయ్యారు. అదే సమయంలో శుక్లా హత్య కేసులో షాహబుద్దీన్ దోషిగా తేలాడు. 2007 లో కోర్టు జీవిత ఖైదు విధించింది. తర్వాత షాహాబుద్దీన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. తరువాత కూడా షాహాబుద్దీన్ తన భార్య హీనా షాహాబ్‌ను రెండుసార్లు (2009 మరియు 2014) ఎన్నికలలో నిలబెట్టాడు కానీ ఆమె రెండుసార్లు ఓడిపోయింది. తిహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తూ కరోనాకు గురయ్యాడు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Mahesh And Trivikram: అత‌డు… ఖ‌లేజా.. మ‌రి ఇప్పుడు.? 11 ఏళ్ల త‌ర్వాత రిపీట్ కాబోతోన్న క్రేజీ కాంబినేష‌న్‌..

ఎల్‌ఈడీ టీవీ స్పీకర్లలో భారీగా బంగారం.. చెన్నై విమానాశ్రయంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడు అరెస్టు