కశ్మీర్ ప్రత్యేక దేశం అంటూ పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధూ సలహాదారులు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ.. రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశాయి. మరోవైపు సిద్ధూ సలహాదారుల వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కూడా తప్పు పడుతున్నారు. “కశ్మీర్ ప్రత్యేక దేశం.. ఇండియా, పాకిస్తాన్ దేశాలు దాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నాయి.. కశ్మీరీలలే కశ్మీర్..” ఈ వ్యాఖ్యలు చేసింది ఇంకెవరో అయితే పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు.. కానీ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సిద్దు సలహాదారుల్లో ఒకరైన మల్వీందర్ సింగ్ మాలి ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్స్ ఇవి.. ఆర్టికల్ 370, 35A నిబంధనలతో పాటు ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమిచుకోవడంపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. ఇది చాలదా అన్నట్లు మరో సలహాదారు ప్యారేలాల్ గార్గ్ పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ పాకిస్తాన్‌ను విమర్శించడాన్ని తప్పుపట్టారు..
సిద్ధూ కీలక సలహాదార్లు మల్వీందర్ సింగ్, ప్యారేలాల్ గార్డ్ చేసిన ఈ కామెంట్స్ తీవ్రమైన రాజకీయ దుమారాన్నే రేపాయి.. స్వయాన కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులే తప్పుపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం అమరిందర్ సింగ్.. మల్విందర్, ప్యారేలాల్ చేసిన వ్యాఖ్యలు దేశ శాంతి, సామరస్యతకు భంగం కలిగేలా ఉన్నాయని.. వారిని నియంత్రించాలని సిద్ధూకు సూచించారు.
భారత్‌లో జమ్ముకశ్మీర్ భాగం కాదనేవారు, పాకిస్థాన్ అనుకూల ధోరణి ఉన్నవారు ఆత్మపరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ సూచించారు. అలాంటి వారికి పంజాబ్ పీసీసీలో స్థానం అవసరమా అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్ రావత్‌ను కోరుతూ మనీశ్ తివారీ ట్వీట్ చేశారు.
ఇక సిద్ధూ సలహాదారుల వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. దీనిపై రాహుల్‌గాంధీ స్పందించాలని డిమాండ్ చేసింది. గతంలో సిద్దూ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రశంసలు కురిపించడాన్ని గుర్తు చేశారు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత పాత్ర..సిద్దూ నుంచే ఆయన సలహాదార్లు ప్రేరణ పొందారా అని ప్రశ్నించారు. మరోవైపు ఈ పరిణామాలపై ఇరకాటంలో పడిన సిద్ధూ తన సలహాదార్లు ఇద్దరినీ ఇంటికి పిలిచి భేటీ ఆయ్యారు.. అయితే బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు..
ఇవి కూడా చదవండి: Vizianagaram : విజయనగరం ఏజెన్సీలో వింత ఆచారం..వర్షాలు కురవాలని ఇలా చేస్తారట..
Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో కట్టప్ప, ఒకప్పుడు తాలిబన్ కసాయి.. ఇప్పుడు వారికి ఆప్తమిత్రుడు..