AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నరికి పోగులు పెడతా: విలేకరిపై బాలయ్య దుర్భాషలు

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే పలు బహిరంగ ప్రదేశాల్లో తన అభిమానులపై చేయి చేసుకోవడం, వారి పట్ల దురుసుగా వ్యవహరించిన బాలయ్య ఈ సారి ఓ విలేకరిపై ఫైర్ అయ్యారు. నరికి పోగులు పెడతా అంటూ ఆ రిపోర్టర్‌ను బాలయ్య దుర్భాషలాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందూపురం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోన్న బాలకృష్ణ ప్రచారంలో భాగంగా మధ్యాహ్నం భోజనం చేసేందుకు మార్గమధ్యలో […]

నరికి పోగులు పెడతా: విలేకరిపై బాలయ్య దుర్భాషలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 28, 2019 | 8:08 AM

Share

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే పలు బహిరంగ ప్రదేశాల్లో తన అభిమానులపై చేయి చేసుకోవడం, వారి పట్ల దురుసుగా వ్యవహరించిన బాలయ్య ఈ సారి ఓ విలేకరిపై ఫైర్ అయ్యారు. నరికి పోగులు పెడతా అంటూ ఆ రిపోర్టర్‌ను బాలయ్య దుర్భాషలాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హిందూపురం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోన్న బాలకృష్ణ ప్రచారంలో భాగంగా మధ్యాహ్నం భోజనం చేసేందుకు మార్గమధ్యలో ఓ కార్యకర్త ఇంటికి వెళ్లారు. అక్కడ అతడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో చిన్నపిల్లలు గుమికూడారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన బాలయ్య వారిపై రంకెలేశారు. ఈ తతంగాన్ని ఓ చానెల్ రిపోర్టర్ వీడియో తీస్తుండటం గమనించిన బాలయ్య ఆగ్రహావేశం కట్టలు తెంచుకుంది.  ‘‘డిలీట్ చెయి, రాస్కెల్స్. మా బతుకులు మీ చేతుల్లో ఉన్నాయా రా’’ అంటూ బాలయ్య దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా ‘‘నాకు బాంబులు విసరడం తెలుసు.. కత్తి తిప్పడం కూడా తెలుసు..ప్రాణాలు తీస్తా’’ అంటూ ఆ విలేకరికి వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు బాలకృష్ణ.

‘‘మీడియా మిత్రులకి నమస్కారం, ఇవాళ నా ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడున్న చిన్న పిల్లల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరిమూకల పని అని భావించి వారిని వద్దని వారించడం జరిగింది, అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసింది. అంతే కానీ ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదు. ఈ విషయం లో మీడియా మిత్రులకి బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతూ… మీ నందమూరి బాలకృష్ణ’’అంటూ ఆయన ఓ ప్రకటనను ఇచ్చారు.

https://www.facebook.com/NandamuriBalakrishna/posts/2333088280076691

వెండిలో అతి తక్కువ పెట్టుబడి.. ఏడాదిలో ఎంత రాబడి వచ్చిందంటే?
వెండిలో అతి తక్కువ పెట్టుబడి.. ఏడాదిలో ఎంత రాబడి వచ్చిందంటే?
ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
ఈసారి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగానే.!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?