మున్సిపాల్టీలో మీకు పని ఉందా..? అయితే ఒక్కో పనికి ఒక్కో రేటు.. సంచలనం రేపుతున్న సిబ్బంది ఆడియో రికార్డ్స్

|

Feb 25, 2021 | 11:47 AM

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ని మున్సిపాలిటీలో కమిషన్ల గొడవ రచకెక్కింది. బిల్లుల చెల్లింపు కోసం మున్సిపల్ అధికారులు కమిషన్ లకు కకృతి పడిన వైనం..

మున్సిపాల్టీలో మీకు పని ఉందా..? అయితే ఒక్కో పనికి ఒక్కో రేటు.. సంచలనం రేపుతున్న సిబ్బంది ఆడియో రికార్డ్స్
Follow us on

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ని మున్సిపాలిటీలో కమిషన్ల గొడవ రచకెక్కింది. బిల్లుల చెల్లింపు కోసం మున్సిపల్ అధికారులు కమిషన్ లకు కకృతి పడిన వైనం వెలుగుచూసింది. అభివృద్ధి పనుల పేరిట కమిషన్ లకు తెగబడటం మున్సిపాల్టీలో రచ్చకు దారితీసింది. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు, ఇతర అత్యవసర పనులను టెండర్లు, నామినేషన్ పద్ధతుల్లో కాంట్రాక్టర్లకు అప్పగిస్తుండగా.. వారికి బిల్లులను మంజూరు చేసే సమయంలో కమీషన్లు ఇవ్వనిదే బిల్లు పాస్ కాదనే వాదనకు బలం చేకూరేలా సిబ్బంది, కాంట్రాక్టర్ల మధ్య జరిగిన సంభాషణలు సంచలనం కలిగిస్తున్నాయి.

బిల్లు పాస్ కావాలంటే చేయి తడాపల్సిందే అంటూ కొందరు ఉద్యోగులు చేస్తున్న నిర్వహకం మున్సిపాలిటీ ఆపీస్ లో లంచాల గబ్బును తేటతెల్లం చేసింది. ఛాయ్ సమోసాలకోసం 15 వందల , శానిటరీ బిల్లుల కోసం ఏకంగా రిప్రీజటర్ ఇస్తేనే పని అవుతుందంటూ శానిటరీ ఇన్స్పెక్టర్ డబ్బులు డిమాండ్ చేసినట్టుగా చెపుతున్న ఆడియో టేపులు ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతున్నాయి.

మున్సిపల్ శానిటరీ ఇన్స్ పెక్టర్ శ్యాంకుమార్ కు జేసీబీ కాంట్రాక్టర్ వాషింగ్ మిషన్ ఇచ్చినట్లు చెప్పిన ఆడియో, సోడియం హైపోక్లో రైడ్ ద్రావణం సరఫరా బిల్లు మంజూరు చేసేందుకు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనిత డబ్బులు డిమాండ్ చేసి తీసుకుందంటూ ఆ కాంట్రాక్టర్ చేసిన వ్యాఖ్యలతో కూడిన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మున్సిపాలిటీ ఉద్యోగులకు ఎంత కమీషన్ ఇవ్వాలో తమకు తెలుసునని, ఇష్టమొచ్చినంత ఎలా అడుగుతారని సదరు కాంట్రాక్టర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

పట్టణ ప్రగతిలో భాగంగా రూ.75.71 లక్షలు నిధులు ప్రభుత్వం విడుదల చేస్తుంది. మంచిర్యాల మున్సిపాలిటీ  ఇందులో సగానికి పైగా అత్యవసర పనులకు కేటాయిస్తున్నారు. మున్సిపాలిటీకి జేసీబీ లేకపో వడంతో ప్రైవేటు వాహనాన్ని వినియోగిస్తు న్నారు. చేసిన పనికంటే ఎక్కువ బిల్లు చేసి.. అందులో కమీషన్లు పంచుకుంటున్నారన్న ఆరోపణలు ముందునుంచీ ఉన్నాయి. అవినీతి కి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్న సిబ్బంది పై అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

Read more:

దెయ్యం భయంతో ఖాళీ అయిన ఊరు.. చూసినవారు చూసినట్టే చనిపోతున్నారని వణికిపోతున్న గ్రామం