Raghurama krishnam raju arrest reactions : పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేయడాన్ని ఏపీ టీడీపీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. రఘురామకృష్ణంరాజు లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పలేకే అక్రమ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. “వారెంట్ లేకుండా ఎంపి స్థాయి వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు? రూల్ ఆఫ్ లాను నిర్వీర్యం చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడానికి సిఐడిని ఆయుధంగా వాడుతున్న జగన్. వారెంట్ లేకుండా వై కేటగిరి భద్రతలో ఉన్న ఎంపిని ఎలా అరెస్ట్ చేస్తారు? లోక్ సభ స్పీకర్, హోంమంత్రిత్వశాఖ అనుమతి పొందారా? ప్రివిలేజ్ కమిటీ ముందు ఎపి సిఐడి దోషిగా నిలబడక తప్పదు.” అని అచ్చెన్న వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా, రఘరామ అరెస్ట్‌పై ఎపి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. “రఘరామకృష్ణంరాజు లాంటి వెధవ ఎవరూ ఉండరు.. ఎంపి రఘరామకృష్ణంరాజు మనిషికాదు… శాడిస్టు… సైకో… వైయస్‌ఆర్ పార్టీ నుంచి గెలిచి వైసిపిని విమర్శిస్తాడు… జగన్ లేకపోతే అతనెక్కడున్నాడు… అతని గురించి మాట్లాడేందుకు కూడా స్థాయి లేని మనిషి… అతడ్ని అరెస్ట్ చేయడం ఏమాత్రం తప్పులేదు… ఈ అరెస్ట్ పై ప్రజలు హర్షిస్తున్నారు. ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేసి ఉండాల్సింది… సియం జగన్ చాలా ఓపిక పట్టారు.” అని బాలినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read also : YS Sharmila : కరోనాతో పెద్ద దిక్కు కోల్పోయిన తెలంగాణ ఆడ బిడ్డలకు షర్మిల అండ, “ఆపదలో తోడుగా YSSR టీం” ఏర్పాటు