ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పాలక, ప్రతిక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతుండగా… ఇవాళ్టితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. పట్టున్న ప్రాంతాల్లో ప్రచారం స్పీడ్ పెంచడంతో పాటు మిగతా ప్రాంతాల్లోని బలమైన అభ్యర్థులపై గురిపెట్టాయి.
పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఫుల్ జోష్‌లో ఉంది అధికారపార్టీ వైసీపీ. అంతకు మించి ఫలితాలు మున్సిపల్ ఎన్నికల్లో ఖాయమంటుంది. ఇక టీడీపీ తట్టా బుట్టా సర్దుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే అత్యధిక స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న ఫంక పార్టీ.. మిగిలిన స్థానాల్లోనూ జెండా ఎగిరేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. మరోవైపు అధికార పార్టీకి ధీటుగా టీడీపీ కూడా వ్యూహాలు రచిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేయడం చేతగాక.. భయటపెట్టి ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆఖరు రోజున ప్రచారం రసవత్తరంగా సాగుతుంది.
నిబంధనల ప్రకారం ఈ రోజు సాయంత్రం 5.00గంటల వరకే ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చు. ఇక, ఎల్లుండి రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలు, 75 కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహిస్తారు. ఈనెల 14న ఓట్లను లెక్కించనున్నారు. ఈ నేపథ్యంలో ఆఖరు రోజున అమాత్యులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నారు. ఎన్నికల్లో విజయం తమదే అంటే తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పోలింగ్‌కు సంబంధించి ఎప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. డబ్బు, మద్యం పంపిణీపై ఫిర్యాదులు రావడంతో… ఎస్ఈసీ గట్టి నిఘా ఏర్పాటు చేసింది. మొత్తంగా ఇవాళ ప్రచారానికి తెరపడినా.. సైలెంట్‌గా ప్రలోభాల పర్వానికి తెరలేపేందుకు ప్లాన్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు.
తూర్పుగోదావరి జిల్లాలో గతేడాది మార్చిలో పుర ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా నామపత్రాలు దాఖలు చేసిన అయిదుగురు వివిధ కారణాలతో మరణించారు. ఆయా వ్యక్తుల స్థానాల్లో ఈనెల 25న నామపత్రాలు దాఖలుకు అవకాశం కల్పించారు. వాటిలో అయిదింటికి రెండుచోట్ల మాత్రమే నామపత్రాలు దాఖలయ్యాయి. వీటితో కలిపి గతేడాది దాఖలైన నామపత్రాల ఉపసంహరణకు ఈ నెల 2, 3 తేదీల్లో అవకాశం కల్పించారు.
అనంతరం 4 నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు పెద్దఎత్తున తమ గెలుపు కోసం ప్రచారం చేశారు. ఆయా పార్టీలకు చెందిన ప్రముఖులు ఓటర్ల వద్దకు వెళ్లి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైకాపా నుంచి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, తెదేపా నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.
జిల్లాకు చెందిన మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున రంగంలోకి దిగారు. ఇంకా సోమవారం సాయంత్రం 5 గంటల వరకే సమయం ఉండటంతో దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
Read More:
కొత్తపార్టీపై ఏర్పాటుపై స్పీడ్ పెంచిన షర్మిల.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మరో కీలక అడుగు