సచివాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయిన మంత్రులు.. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పరస్పరం అభినందనలు

|

Feb 23, 2021 | 6:24 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. నాలుగు విడతల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ మద్దతుదారులు అత్యధిక పంచాయతీల్లో..

సచివాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయిన మంత్రులు.. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పరస్పరం  అభినందనలు
Follow us on

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. నాలుగు విడతల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ మద్దతుదారులు అత్యధిక పంచాయతీల్లో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

సచివాలయంలో సీఎం జగన్‌ను మంత్రులు పేర్నినాని, కొడాలి నాని, కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్‌ కలుసుకున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పంచాయితీల్లో 80 శాతం ఫలితాలు సాధించిన సందర్భంగా సీఎం జగన్‌కు మంత్రులు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులను గెలిపించిన మంత్రులను సీఎం జగన్‌ అభినందించారు. మనం చేసిన మంచి పనుల వల్లే ప్రజలు మన వెంట ఉన్నారని చెప్పారు. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా ఇలాంటి ఫలితాలే వస్తాయని అశాభావం వ్యక్తం చేశారు.

Read more:

ఏపీ పోలీసులను అభినందించిన డీజీపీ.. పంచాయతీ స్ఫూర్తితో రాబోవు ఎన్నికల్లో పని చేయాలన్న గతమ్‌సవాంగ్‌