జగన్‌పై మంత్రి పుల్లారావు విమర్శలు

| Edited By: TV9 Telugu Digital Desk

Mar 07, 2019 | 10:02 AM

గుంటూరు: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి పుల్లారావు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జగన్ తీరు దొంగే దొంగ అని అరిచినట్టుగా ఉందన్నారు. తెలంగాణలో ఓట్లను తొలగించి టీఆర్ఎస్ గెలిచినట్లుగా.. ఏపీలో కూడా వైసీపీ అలాగే గెలవాలనుకుంటుందని ఆరోపించారు. జగన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాదయాత్ర చేస్తే ప్రజలు ఓట్లు వేయరన్నారు. పాదయాత్రను అపవిత్రం చేసిన ఘనాపాటి జగన్ అని వ్యాఖ్యానించారు. గృహప్రవేశం చేసి ఏపీలో ఒక రాత్రి కూడా నిద్ర చేసే […]

జగన్‌పై మంత్రి పుల్లారావు విమర్శలు
Follow us on
గుంటూరు: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి పుల్లారావు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జగన్ తీరు దొంగే దొంగ అని అరిచినట్టుగా ఉందన్నారు. తెలంగాణలో ఓట్లను తొలగించి టీఆర్ఎస్ గెలిచినట్లుగా.. ఏపీలో కూడా వైసీపీ అలాగే గెలవాలనుకుంటుందని ఆరోపించారు. జగన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
పాదయాత్ర చేస్తే ప్రజలు ఓట్లు వేయరన్నారు. పాదయాత్రను అపవిత్రం చేసిన ఘనాపాటి జగన్ అని వ్యాఖ్యానించారు. గృహప్రవేశం చేసి ఏపీలో ఒక రాత్రి కూడా నిద్ర చేసే ధైర్యం జగన్‌కు లేదన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును హరించేందుకు జగన్ కుట్ర చేశారని ఆరోపించారు. అధికారంలోకి రాకముందే కుట్రలు చేస్తే.. జగన్‌కు సామాన్య ప్రజలు ఎలా ఓట్లు వేస్తారన్నారు. గత 6 నెలలుగా అధికారం కోసం వైసీపీ ఎన్ని నాటకాలు ఆడిందో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ డేటాను దొంగలించారన్నారు. మీరు దొంగిలించింది సేవామిత్ర, టీడీపీ పార్టీ డేటాను అని పేర్కొన్నారు.