Balineni Srinivasula Reddy : కృష్ణా జలాల పంపిణీ విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్నారని ఎపి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచడం వల్ల ప్రకాశం జిల్లాకు అన్యాయం జరుగుతుందని టిడిపి ఎమ్మెల్యేలతో లేఖలు రాయిస్తున్న చంద్రబాబు.. తానేందుకు ఈ విషయంలో డైరెక్ట్‌గా మాట్లాడటం లేదో చెప్పాలని ఆయన నిలదీశారు. పక్కరాష్ట్రంతో నీటివాటా కోసం పోరాటం చేయడం తప్పా..! అని మంత్రి బాలినేని ప్రశ్నించారు.
గతంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించారని బాలినేని విమర్శించారు. ఇప్పుడు నీళ్ళను అడ్డం పెట్టుకుని జిల్లాకు.. జిల్లాకు మధ్య గొడవలు పెడుతున్నారని ఆరోపించారు. మాల, మాదిగల మధ్య అలాగే బిసి, కాపుల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించారని చెప్పారు బాలినేని.
అమరావతి రాజధాని విషయంలో సుప్రీంకోర్టులో కేసు ఉందని, దీని విషయంలో ఇంకా స్పష్టత రాలేదని మంత్రి తెలిపారు. అమరావతి విషయం స్వయంగా సీఎం చూసుకుంటున్నారని బాలినేని ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.