వాలంటీర్ల ఫోన్ల విషయంలో ఏపీ హైకోర్టు విచారణ.. ఎన్నికల సమయంలో మొబైల్‌ వినియోగం చట్టవిరుద్దమన్న పిటిషనర్‌

|

Feb 24, 2021 | 3:34 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఇక మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతుంది. రాష్ట్రంలోని పురపాలక సంస్థలకు..

వాలంటీర్ల ఫోన్ల విషయంలో ఏపీ హైకోర్టు విచారణ.. ఎన్నికల సమయంలో మొబైల్‌ వినియోగం చట్టవిరుద్దమన్న పిటిషనర్‌
The AP High Court
Follow us on

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఇక మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతుంది. రాష్ట్రంలోని పురపాలక సంస్థలకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ల విషయంలో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది.

రాష్ట్రంలో ఎన్నికల సమయంలో గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం ఫోన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ వాదనలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల సమయంలో మొబైల్ వినియోగం చట్టవిరుద్దమని పిటిషనర్ అభ్యంతరం తెలిపారు.

ఫోన్ల ద్వారా ఓటర్లపై ఒత్తిడి తెచ్చే అవకాశముందని పిటీషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. వార్డు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని ఎస్ఈసి ఆదేశాలున్నాయని ఎస్ఈసి తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలు అందించేందుకు న్యాయవాది సమయం కోరగా, హైకోర్టు తదుపరి విచారణ మార్చి 1వ తేదీ కి వాయిదా వేసింది.

Read more:

ఆ కేసు విచారణ వేగవంతం చేయండి.. తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై లేఖ