విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపుతో స్తంభించిన ఏపీ.. ఏపీ బంద్‌కు అఖిలపక్షాల సంఘీభావం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమవుతోంది. కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో ఏపీ వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. బీజేపీ మినహా అన్ని పార్టీలు బంద్‌కు..

విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపుతో స్తంభించిన ఏపీ.. ఏపీ బంద్‌కు అఖిలపక్షాల సంఘీభావం
Follow us

|

Updated on: Mar 05, 2021 | 12:09 PM

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమవుతోంది. కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో ఏపీ వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. బీజేపీ మినహా అన్ని పార్టీలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్ని పార్టీల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో బంద్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకు విశాఖకే పరిమితమైన ఉద్యమం ఇప్పుడు రాష్ట్రం మొత్తం విస్తరించింది. అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు కూడా బంద్‌లో పాల్గొంటున్నారు. విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతితో పాటు వైసీపీ నేతలు బంద్‌లో పాల్గొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి రిపోర్టర్‌ అవతారం ఎత్తారు. ఇతర పార్టీల నేతలతో పాటు విశాఖలోని స్థానికుల నుంచి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటూ నినదించేలా చేశారు.

స్టీల్‌ ప్లాంట్‌ గాడిలో పడేందుకు కేంద్రానికి సీఎం జగన్‌ సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలు పాటిస్తే సరిపోతుందని, ప్రైవేటీకరణను ఉపసంహరించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. సీఎం జగన్‌ కేంద్రానికి లేఖ రాసిన పది రోజుల తర్వాత ప్రతిపక్ష నేత మేల్కొన్నారని, టీడీపీ డ్రామాల పార్టీ అని ఎద్దేవా చేశారు విజయసాయి. అటు కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఏపీ సర్కార్‌ కోరుకుండగా, ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించి కేంద్రం తీరని అన్యాయం చేసిందంటున్నారు మంత్రి అవంతి. ఉక్కు ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఉపసంహరించుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందంటున్నారు వైసీపీ నేతలు. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపుతో ఏపీ స్తంభించింది. బస్సులకు బ్రేకులు పడ్డాయి..దుకాణాలకు తాళాలు పడ్డాయి. కేంద్రం దిగొచ్చేవరకూ పోరాటం ఆగదంటున్నారు కార్మికులు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు బంద్‌కు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. లారీ యజమానుల సంఘాలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతునిచ్చాయి. బీజీపీ మినహా అన్ని పార్టీల రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు కూడా బంద్‌ను విజయవంతం చేయాలని జిల్లాల్లోని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాయి.

గుంటూరులో కార్మిక సంఘాలతో పాటు స్ధానికులు స్వచ్చంధంగా బంద్‌లో పాల్గోన్నారు. దుకాణాలు బంద్‌కి స్టీల్‌ ఉద్యమానికి మద్దతు తెలిపారు. అటు విజయవాడలో బంద్‌ కొనసాగుతోంది. ప్రజాసంఘాలతో పాటు …పలు కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. వ్యాపార, విద్యా సంస్ధలు స్వచ్చంధంగా మూతపడ్డాయి. రాష్ట్ర బంద్‌కు సంఘీభావం తెలిపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మధ్నాహ్నం విశాఖ వెళ్లనున్నారు. చంద్రబాబు పర్యటన నేపధ్యంలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది. కాకినాడతో పాటు రాజమండ్రిలో షాపులు మూతపడ్డాయి. వ్యాపారులు స్వచ్చంధంగా షాపులు మూసివేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే కేంద్రాన్ని గద్దె దించుతామని లెఫ్ట్‌ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.

కాకినాడలో బంద్ ప్ర‌భావం క‌నిపించింది. అధికార పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌తో స‌హా అన్ని రాజ‌కీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్ర‌జా సంఘాలు ఈ బంద్‌కి సంఘీభావం తెలిపాయి. జెఎన్‌టీయూలో నేడు జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసారు. కాకినాడ సీపోర్ట్ లో కార్మికులు బంద్ ప్ర‌క‌టించ‌డంతో అక్క‌డి కార్య‌క‌లాపాలు నిలిచిపోయాయి. స్కూల్స్, బ్యాంక్‌లు, వ్యాపార సంస్థ‌లు, దుకాణాలు, సినిమా హాల్స్ మూత ప‌డ్డాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోల‌కే ప‌రిమితం అయ్యాయి. ట్రావెల్స్, ఆటో డ్రైవ‌ర్ లు కూడా బంద్ పాటిస్తుండ‌టంతో జ‌న‌ సంచారం నిలిచిపోయింది.

Read More:

షర్మిల కొత్త పార్టీపై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్‌.. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏమన్నారంటే..