Chief whip Srikanth Reddy – Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల అంశంలో ఏపీ బీజేపీ నేతలు రాజీ పడొద్దని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. ఎవరికైనా రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కావాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంలో ఏ ఒక్కరూ చెప్పినా కూడా తదననుగుణంగా ముందుకెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ తరపున పోటీచేస్తోన్న అభ్యర్థి దాసరి సుధా విద్యావంతురాలని ఆమె స్వతహాగా ఒక డాక్టర్ కూడా అని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ఆమెకు ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉందని.. ఈ ప్రాంత వాసి. మీరు పెట్టిన అభ్యర్థి పక్క ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి. ఎవరికి ఈ ప్రాంతంపై అవగాహన ఉంటుందో మీరే చెప్పాలి.. అని బీజేపీ అభ్యర్థి గురించి ప్రస్తావిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టు మీద సోము వీర్రాజు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీసిన శ్రీకాంత్ రెడ్డి.. పోలవరం విషయంలో కేంద్రం నిధులు ఇవ్వకపోయినా మేం కష్టపడి పూర్తి చేస్తున్నామన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వడం లేదు… రూ.20 వేల కోట్లకే పరిమితం చేశారు. ఇంకా రూ.3 వేల కోట్లు ఇవ్వాలి. ఇది కేంద్రం బాధ్యత కాదా? తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చిన సోము వీర్రాజుకు బాధ్యత లేదా? అంటూ శ్రీకాంత్ రెడ్డి.. సోము వీర్రాజును ప్రశ్నించారు.