స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏపీలో అధికార వైసీపీలోకి వలసలు కొనసాగుతూ.. ప్రతిపక్ష టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు పడుతున్నాయి. ఇప్పటికే టీడీపీని వీడిన పలువురు మాజీలు, సీనియర్ నేతలు వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఇక సీఎం సొంత జిల్లా కడపలో టీడీపీకి భారీ షాక్‌లు తగులుతున్నాయి. పులివెందుల టీడీపీ ఇంచార్జ్ సతీష్ రెడ్డి ఈ ఉదయం పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా మరో మంత్రి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. టీడీపీని వీడాలని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. బుధవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అనుచరులకు ఫోన్ చేసి రామసుబ్బారెడ్డి సమాచారం అందించినట్లు సమాచారం.
Read This Story Also: ఆ బాలీవుడ్ భామనే కావాలంటోన్న ప్రభాస్.. ఈ సారైనా ఓకే చెప్తుందా..!