‘అమరావతి’నే ఏపీకి రాజధాని చేయాలి..లేదంటే..!: రైతులు

| Edited By:

Aug 24, 2019 | 9:23 AM

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని లేదంటే.. ఉద్యమం తీవ్రతరం చేస్తామని అమరావతి రైతులు అంటున్నారు. అమరావతి కోసం భూమి ఇచ్చి.. ఇప్పుడు మార్చుతామంటే.. కుదరదని తెగేసి చెప్తున్నారు. రాజధాని కోసం మా భూములను కోల్పోయామని.. అలాంటిది.. ఇప్పుడు ఎలా మార్చుతారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు రైతులు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను కలిసి తమకు అండగా నిలబడాలని కోరారు. దాదాపు 23 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏపీ రాజధాని […]

అమరావతినే ఏపీకి రాజధాని చేయాలి..లేదంటే..!: రైతులు
Follow us on

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని లేదంటే.. ఉద్యమం తీవ్రతరం చేస్తామని అమరావతి రైతులు అంటున్నారు. అమరావతి కోసం భూమి ఇచ్చి.. ఇప్పుడు మార్చుతామంటే.. కుదరదని తెగేసి చెప్తున్నారు. రాజధాని కోసం మా భూములను కోల్పోయామని.. అలాంటిది.. ఇప్పుడు ఎలా మార్చుతారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు రైతులు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను కలిసి తమకు అండగా నిలబడాలని కోరారు.

దాదాపు 23 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏపీ రాజధాని కోసం ఏకంగా 33 వేల ఎకరాల భూమిని ఇస్తే.. జగన్ ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా.. కుంటి సాకులతో మార్చే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు. అమరావతిని కాపాడుకుంటామని.. అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసి రాజధాని కోసం పోరాటం చేస్తామని రైతులు తేల్చి చెప్తున్నారు.

బొత్స సత్యనారాయణ మాటలు వింటుంటే మాకు ఆశ్చర్యం వేస్తుందని.. దాదాపు మేము ఇక్కడ 50 సంవత్సరాల నుంచి ఉంటున్నామని.. ఎప్పుడూ ఇక్కడ అమరావతి మునిగిపోలేదని రైతులు చెప్తున్నారు. విశాఖపట్నంలో కూర్చొని మా పొట్ల మీద కొడుతున్నారని.. బొత్స సత్యనారాయణను తీవ్రంగా దూయబట్టారు. సీఎం జగన్‌ను కలిసి మా సమస్యను విన్నవిస్తామని.. కానీ.. ఖచ్చితంగా ఏపీ రాజధాని అమరావతినే కావాలని గట్టిగా చెప్తున్నారు రైతులు.

మాకు రాజకీయాలతో సంబంధం లేదని.. ఎవరు మంచి పాలన చేస్తే.. వారితోనే ఉంటామని రైతులు చెప్తున్నారు. అలాగే.. జగన్.. అమరావతినే రాజధానిగా చేస్తే.. ఆంధ్రప్రదేశ్ రైతులంతా తన వెంటనే ఉంటామని అంటున్నారు. ఒకవేళ ఆయన కూడా అదే పాట పాడితే.. మేము ఏం చేయడానికైనా సిద్ధమని.. మా భూములు ఇచ్చి.. మేము అన్యాయమవుతున్నామని వాపోతున్నారు అమరావతి రైతులు.