AICC, APCC statement on Chiranjeevi : ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి ముమ్మాటికీ కాంగ్రెస్ వాదేనని ఎఐసిసి, ఎపిసిసి స్పష్టీకరించాయి. నిన్న ఉమెన్ చాందీ మాట్లాడుతూ చిరంజీవిని కాంగ్రెస్ వాది కాదని చెప్పారంటూ వచ్చిన వార్తలు ముమ్మాటికీ తప్పేనని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఎపిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాధ్ ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిన్న ఎపిసిసి వ్యవహారాల ఇన్ చార్జి ఉమెన్ చాందీ కేవలం చిరంజీవి తనకిష్టమైన సినీ రంగంలో బిజీగా ఉండడం వల్లనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెప్పారు అని శైలజానాధ్ వివరణ ఇచ్చారు.
కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు, పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తూ చిరంజీవి ప్రజలతో మమేకమవుతున్నారు.. చిరంజీవి, ఆయన కుటుంబం మొదట నుంచి కాంగ్రెస్ వాదులు. చిరంజీవి కాంగ్రెస్ వాది కాదు అని వార్తలు రాయడం దారుణం అని సదరు ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్తులో చిరంజీవి సేవలు పార్టీకి అందుతాయి..ఆయన క్రియాశీలకంగా రాజకీయాల్లో పాల్గొనే అవకాశం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది… ప్రకటన పూర్తి పాఠం దిగువున..