బీజేపీ ఆడించినట్టల్లా ఆడుతున్న దర్యాప్తు సంస్థలు, కేరళ సీఎం పినరయి విజయన్

| Edited By: Anil kumar poka

Mar 07, 2021 | 1:40 PM

కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ ఆడించినట్టల్లా ఆడుతున్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. తమ రాష్ట్రంలో ఈ సంస్థలు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టి  నిర్వహిస్తున్నాయని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

బీజేపీ ఆడించినట్టల్లా ఆడుతున్న దర్యాప్తు సంస్థలు, కేరళ సీఎం పినరయి విజయన్
Follow us on

కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ ఆడించినట్టల్లా ఆడుతున్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. తమ రాష్ట్రంలో ఈ సంస్థలు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టి  నిర్వహిస్తున్నాయని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కానీ ఈ విధమైన  పోకడలకు తాము బెదిరేది లేదని, తమది నీతివంతమైన విధానాలని ఆయన చెప్పారు. మీరు ఏం చేసినా ఈ రాష్ట్ర ప్రజలు విశ్వసించబోరని,  తమని విమర్శించబోరని, మా జీవితాలు తెరచిన పుస్తకాలవంటివని ఆయన చెప్పారు. మీరు త్వరలోనే ఈ విషయాన్ని గుర్తిస్తారని  పేర్కొన్నారు.  ఆయన ఇంత ఘాటుగా వ్యాఖ్యానించడానికి కారణాలున్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం పినరయి విజయన్ , స్పీకర్ పి.శ్రీరామకృష్ణన్, మరో ముగ్గురు మంత్రులకు సంబంధాలు ఉన్నాయని ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ చెప్పిందంటూ కస్టమ్స్ అధికారులు కేరళ హైకోర్టుకు తెలపడంతో విజయన్ మండిపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో.కస్టమ్స్ కమిషనర్ కోర్టులో ఇలా వ్యాఖ్యానించారంటే అది రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేయడం, అవమానించడం తప్ప మరేమీ కాదన్నారు.ఈసీ ఎన్నికలను ప్రకటించిన తరువాత.. దర్యాప్తు సంస్థల దాడులు పెరిగాయని, కేబినెట్ మంత్రులను, స్పీకర్ ను అవమానించేందుకు కస్టమ్స్ కమిషనర్ ఎన్నికల రంగంలో దూకారని ఆయన తప్పు పట్టారు.

బీజేపీ, కాంగ్రెస్ కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా, స్వేచ్చగా జరగాలని కోరుకోవడం లేదని ఆయన ఆరోపించారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ, ఈడీ, కస్టమ్స్ శాఖలు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. అయితే ఇక్కడ స్వయంగా ముఖ్యమంత్రి పై కూడా ఆరోపణలు వచ్చాయని. నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలనీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. డాలర్ల కేసులో స్పీకర్  శ్రీరామకృష్ణన్ ప్రమేయం ఉందని కూడా ఇవి ఆరోపిస్తున్నాయి. యూఏఈ మాజీ  హెడ్ ఒకరు ముఖ్యమంత్రి తోను, స్పీకర్ తోను చేతులు కలిపి మస్కట్ కి విదేశీ కరెన్సీ ని అక్రమంగా తరలించారని స్వప్న తెలిపినట్టు కస్టమ్స్ అధికారులు కోర్టుకు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 

మరిన్ని ఇక్కడ చదవండి:

Boxam International: కోవిడ్ రక్కసి వెంటాడింది… స్వర్ణం పోయింది… ఫైనల్స్​ నుంచి ముగ్గురు భారత బాక్సర్ల ఔట్

Rana Daggubati : సుకుమార్ శిష్యుడికి అవకాశం ఇచ్చిన దగ్గుబాటి వారాబాయి.. ఆ దర్శకుడితో రానా సినిమా..