మమత కొలువులో 43 మంది టీఎంసీ మంత్రులు ? రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ! హోమ్ శాఖ దీదీ వద్దే !

బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 43 మంది మంత్రులు రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కీలకమైన హోం శాఖను సీఎం మమతా బెనర్జీయే నిర్వహిస్తారని తెలుస్తోంది.

మమత కొలువులో 43 మంది టీఎంసీ మంత్రులు ? రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ! హోమ్ శాఖ దీదీ వద్దే !
Mamata Banerjee

Edited By: Phani CH

Updated on: May 09, 2021 | 9:32 PM

బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 43 మంది మంత్రులు రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కీలకమైన హోం శాఖను సీఎం మమతా బెనర్జీయే నిర్వహిస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినందున మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను చేపట్టాలని మమత నిర్ణయించారు. సుబ్రతా ముఖర్జీ, అనూప్ రాయ్ వంటి సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణం చేయవచ్చు. బెంగాల్ కేబినెట్ లో 44 బెర్తులు ఉన్నాయి. తాజాగా 43 మందిని మంత్రులుగా తీసుకుంటే మమతతో కలిసి 44 మంది అవుతారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ నేత బిమన్ బెనర్జీ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఆయన వరుసగా ఈ పదవికి ఎంపిక కావడం ఇది మూడోసారి. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 213 సీట్లను గెలుచుకోగా బీజేపీ 77 సీట్లలో విజయం సాధించింది. లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు అయిపు లేకుండా పోయాయి. కాగా రేపటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Seediri Appalaraju: రాష్ట్రాన్ని నాశనం చేస్తోంది.. ఆ పొలిటికల్ వైరస్సే.. చంద్రబాబుపై మంత్రి అప్పలరాజు ఫైర్

కోవిడ్ పై పోరులో నేనూ, ఢిల్లీలో గురుద్వారాకు రూ. 2 కోట్లు విరాళమిచ్చిన బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బీ