అరుణాచల్‌ బరిలో కుబేరులు!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో దాదాపు మూడొంతుల మంది కోటీశ్వరులేనట. ఇక వీరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖందూ అత్యంత సంపన్నుడు. ఆయన ఆస్తులు రూ.163 కోట్ల పైనే అని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. నామినేషన్‌ సమయంలో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్‌లను అధ్యయనం చేసి ఏడీఆర్‌ ఈ నివేదిక తయారుచేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 60 శాసనసభ నియోజకవర్గాలకు గానూ 184 మంది […]

అరుణాచల్‌ బరిలో కుబేరులు!

Edited By:

Updated on: Apr 08, 2019 | 8:14 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో దాదాపు మూడొంతుల మంది కోటీశ్వరులేనట. ఇక వీరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖందూ అత్యంత సంపన్నుడు. ఆయన ఆస్తులు రూ.163 కోట్ల పైనే అని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. నామినేషన్‌ సమయంలో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్‌లను అధ్యయనం చేసి ఏడీఆర్‌ ఈ నివేదిక తయారుచేసింది.

అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 60 శాసనసభ నియోజకవర్గాలకు గానూ 184 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో దాదాపు మూడోంతుల మంది అంటే 131 మంది అభ్యర్థులు కోటీశ్వరులే. 67 మంది అభ్యర్థుల ఆస్తులు రూ. 5 కోట్లు అంతకంటే పైనే ఉండగా.. 44 మంది అభ్యర్థులకు రూ. 2 నుంచి రూ.5 కోట్ల అస్తులు ఉన్నట్లు ఏడీఆర్‌ తమ నివేదికలో పేర్కొంది.