ఎన్నికల వేళ రైతాంగం తిరుగుబాటు

| Edited By:

Apr 04, 2019 | 4:51 PM

ఎన్నికల వేళ రైతాంగం తిరుగుబాటు బావుట ఎగురవేసింది. పొలం విడిచి కదం తొక్కేందుకు వ్యవసాయదారులు సిద్ధమవుతున్నారు. రాజకీయ నాయకులకు ముచ్చెమటలు పోయించబోతున్నారు. మోదీ నియోజకవర్గం వారణాసిలో ఏకంగా 111 మంది తమిళ రైతులు నామినేషన్ వేసి దేశం దృష్టిని ఆకర్షించబోతున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత నియోజకవర్గం నిజామాబాద్‌లో భారీగా పసుపు, ఎర్రజొన్న రైతులు నామినేషన్ వేశారు. ఎన్డీయే సర్కార్ తీరుపై అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. 2017 లో ఢిల్లీలో 100 […]

ఎన్నికల వేళ రైతాంగం తిరుగుబాటు
Follow us on

ఎన్నికల వేళ రైతాంగం తిరుగుబాటు బావుట ఎగురవేసింది. పొలం విడిచి కదం తొక్కేందుకు వ్యవసాయదారులు సిద్ధమవుతున్నారు. రాజకీయ నాయకులకు ముచ్చెమటలు పోయించబోతున్నారు. మోదీ నియోజకవర్గం వారణాసిలో ఏకంగా 111 మంది తమిళ రైతులు నామినేషన్ వేసి దేశం దృష్టిని ఆకర్షించబోతున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత నియోజకవర్గం నిజామాబాద్‌లో భారీగా పసుపు, ఎర్రజొన్న రైతులు నామినేషన్ వేశారు. ఎన్డీయే సర్కార్ తీరుపై అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. 2017 లో ఢిల్లీలో 100 రోజులకుపైగా ఆందోళనలకు నాయకత్వం వహించిన రైతు నాయకుడు మాట్లాడుతూ, “మా డిమాండ్లను నెరవేరుస్తామని మానిఫెస్టోలో వారు పొందుపరిస్తే, మేము మోడీపై పోటీ చేయాలనే మా నిర్ణయాన్ని మార్చుకుంటాం” అన్నారు.